AP Govt Jobs 2023: ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.1,74,790ల జీతం పొందే అవకాశం

|

May 09, 2023 | 9:37 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్.. 14 మేనేజర్ (ఫైనాన్స్), డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్), అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్/ లా) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే..

AP Govt Jobs 2023: ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.1,74,790ల జీతం పొందే అవకాశం
Andhra Pradesh
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్.. 14 మేనేజర్ (ఫైనాన్స్), డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్), అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్/ లా) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో సీఏ/ సీఎంఏ లేదా బీఈ, బీటెక్‌, ఎంబీబీఎస్‌, పీజీడీఎం, డిగ్రీ/ పీజీ (లా ఇన్ బిజినెస్/ కమర్షియల్ లాస్) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు ఏప్రిల్ 1, 2023వ తేదీనాటికి 21 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో మే 15, 2023వ తేదీలోపు కింది అడ్రస్‌లో దరఖాస్తులు అందజేయాలి. దరఖాస్తు సమయంలో జనరల్/బీసీ అభ్యర్ధులకు రూ.1180, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.590 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు మేనేజర్ పోస్టులకు రూ.1,01,970 – 1,74,790; డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.76,730 – 1,62,780; అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు రూ.54,060 – 1,40,540 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.