
అమరావతి, అక్టోబర్ 1: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలు కూడా అందజేశారు. ఇక ఎంపికయిన ఉపాధ్యాయులకు అక్టోబరు 3 నుంచి 10 వరకు శిక్షణ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వీరందరికీ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అక్టోబర్ 9, 10 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ అనంతరం ఎంపికైన కొత్త టీచర్లకు అకడమిక్ కేలండర్, హ్యాండ్‌బుక్ తదితర మెటీరియల్‌ను అందిస్తారు.
అనంతరం మరో విడతగా ఎంపికై టీచర్లకు ఏప్రిల్ 25 నుంచి మే 5 వరకు శిక్షణ తరగతులు ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది. అయితే ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు, కానిస్టేబుళ్లుగా పని చేస్తూ డీఎస్సీ టీచర్ పోస్టులకి ఎంపికైన అభ్యర్ధులు శిక్షణకు హాజరు కావడానికి ఆయా విభాగాలు సెలవులు మంజూరు చేయడం లేదని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టులకు పోస్టింగ్ ఇచ్చినప్పటి నుంచే ప్రస్తుత విధుల నుంచి రిలీవ్ చేస్తామని ఆయా విభాగాలు చెబుతున్నాయని వాపోతున్నారు. మరోవైపు విద్యాశాఖ మాత్రం తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాల్సిందేనని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో అభ్యర్ధులు తికమక పడుతున్నారు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రొవిజినల్ కేటాయింపు జాబితాను విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసోసియేట్స్(JA), ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO), స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) ఉద్యోగాలతో పాటు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRBs) నియామకాలు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన తాత్కాలిక జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ఐబీపీఎస్ JA, PO, SO and RRBs పోస్టుల ప్రొవిజినల్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.