AP RGUKT: ఏపీ ట్రిపుల్‌ఐటీలో 194 లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

|

Jan 10, 2024 | 9:48 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ఒప్పంద ప్రాతిపదికన ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా), ఒంగోలు (ప్రకాశం జిల్లా), నూజివీడు (ఏలూరు జిల్లా), ఆర్కే వ్యాలీ (కడప జిల్లా).. ఈ నాలుగు ఏపీ ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లలో సంబంధిత విభాగాల్లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు..

AP RGUKT: ఏపీ ట్రిపుల్‌ఐటీలో 194 లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
AP RGUKT
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ఒప్పంద ప్రాతిపదికన ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎచ్చెర్ల (శ్రీకాకుళం జిల్లా), ఒంగోలు (ప్రకాశం జిల్లా), నూజివీడు (ఏలూరు జిల్లా), ఆర్కే వ్యాలీ (కడప జిల్లా).. ఈ నాలుగు ఏపీ ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లలో సంబంధిత విభాగాల్లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టులు 194 వరకు ఉన్నాయి. వీటిల్లో లెక్చరర్ పోస్టులు 61, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 133 వరకు ఉన్నాయి.ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు జనవరి 22, 2024వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

లెక్చరర్ పోస్టులు బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, తెలుగు విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో ఎంఏ/ ఎంఎస్సీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి.

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు బయాలజీ, సివిల్ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, ఇంగ్లిష్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటిక్స్, మెకానికల్, ఎంఎంఈ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎంటెక్‌లో ఉత్తీర్ణతతోపాటు నెట్‌/ సెట్‌లో అర్హత సాధించి ఉండాలి. లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ ఇగ్నో సార్వత్రిక విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి జనవరి-2024 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ, డిగ్రీ ఆనర్స్‌, పీజీ డిప్లమా, డిప్లమా, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ తదితర సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం రీజినల్‌ డైరక్టర్‌ డా కె సుమలత ఓ ప్రకటనలో తెలిపారు. సీఏ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఇగ్నో నిర్వహించే ప్రత్యేక బీకాం, ఎంకాం కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర సందేహాలు 0866-2565253 నంబర్‌లను సంప్రదించవచ్చని సూచించారు. దరఖాస్తుల స్వీకరణకు జనవరి 31 ఆఖరు తేదీగా వెల్లడించారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.