AP Polycet 2024 Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. ఏప్రిల్‌ 27న రాత పరీక్ష

|

Apr 18, 2024 | 7:56 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్టేట్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ (AP SBTET) అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పదో తరగతి హాల్‌టికెట్‌ లేదా మొబైల్‌ నంబర్‌, టెన్త్ పాసింగ్‌ ఇయర్‌ వివరాలను..

AP Polycet 2024 Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. ఏప్రిల్‌ 27న రాత పరీక్ష
AP Polycet 2024
Follow us on

అమరావతి, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్టేట్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ (AP SBTET) అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పదో తరగతి హాల్‌టికెట్‌ లేదా మొబైల్‌ నంబర్‌, టెన్త్ పాసింగ్‌ ఇయర్‌ వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పలు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పాలిసెట్‌ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్‌ 2024 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

ఇంటర్‌ తర్వాత మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు అనుమతివ్వాలి: సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ లా కోర్సులో ప్రవేశాలు పొందాలంటే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాకుండా ఇంటర్మీడియట్‌ లేదా 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సు (ఎల్‌ఎల్‌బీ) చదివేందుకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తూ కొందరు అభ్యర్ధులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం.. అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ పూర్తి చేసిన వారు మూడేళ్ల లా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలనే నిబంధన ఉంది.

ఇవి కూడా చదవండి

అయితే, ఇంటర్‌ తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సులో ప్రవేశాలు పొందడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని నియమించేలా కేంద్రం, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈ మేరకు న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విద్యార్థులు మూడేళ్లలో కూడా న్యాయ విద్య కోర్సును పూర్తి చేయగలరని, ప్రస్తుత ఉన్న విధానం వల్ల అయిదేళ్ల కోర్సుతో వారికి సమయం వృథా అవుతుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.