AP Lawcet 2022: ఏపీ లాసెట్‌ దరఖాస్తుల స్వీకరణ మే 13 నుంచి.. త్వరలోనే..

|

Apr 26, 2022 | 4:35 PM

ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ 2022కు దరఖాస్తుల స్వీకరణ మే 13 నుంచి ప్రారంభమౌతుందని ఉన్నత విద్యా మండలి..

AP Lawcet 2022: ఏపీ లాసెట్‌ దరఖాస్తుల స్వీకరణ మే 13 నుంచి.. త్వరలోనే..
Ap Lawcet 2022
Follow us on

AP Lawcet 2022 Application last date: ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ 2022కు దరఖాస్తుల స్వీకరణ మే 13 నుంచి ప్రారంభమౌతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ https://sche.ap.gov.in/lawcetలో జూన్‌ 13 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అపరాధ రుసుము రూ.500తో జూన్‌ 20, రూ.1000లతో జూన్‌ 27, రూ.2000లతో జులై 7వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఇక ఏపీ ఎడ్‌సెట్‌కు మే 9 నుంచి జూన్‌ 7 వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. అపరాధ రుసుము రూ.వెయ్యితో జూన్‌ 15, రూ.2000లతో 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ఈసెట్‌కు మే 3 నుంచి జూన్‌ 3 వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. అపరాధ రుసుము రూ.500తో జూన్‌ 13, రూ.2000లతో 23వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితోపాటు పీజీఈసెట్, ఐసెట్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు త్వరలో నోటిఫికేషన్లు విడుదలకానున్నాయి.

Also Read:

AP Inter hall tickets 2022: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ హాల్ టిక్కెట్లు 2022 విడుదల..