TS Inter Exams 2022 begin tomorrow: తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ( మే 6) ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ల (Inter hall tickets)ను ఆయా ఇంటర్ బోర్డులు (Inter Board) విడుదల చేశాయి కూడా. మే 6 నుంచి 24 వరకు (తెలంగాణలో 23 వరకు).. ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. ఉదయం 8 గంటల30 నిముషాలలోపే పరీక్షాకేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఇక ఏపీలో ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లకు కలిపి మొత్తం 9,14,423 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వృత్తి విద్య పరీక్షలను 87,435 మంది రాయనున్నారు. రాష్ట్రంలో 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగినన్ని రోజులూ.. పరీక్ష కేంద్రాలు ఉన్న మార్గాల్లో రెగ్యులర్ సర్వీసులు ఏవీ రద్దు చేయకుండా నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. బస్ కనెక్టివిటీ లేని కేంద్రాలకు బస్సులు నడపాలని విజ్ఞప్తులు వస్తే వాటిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. గ్రామాల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తీసుకొచ్చి, మళ్లీ వారిని తిరిగి చేర్చేలా సర్వీసులు ఉండాలని అధికారులకు చెప్పారు.
కాగా ఏపీలో ఇప్పటికే ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకుల వ్యవహారం తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. రేపట్నుంచి జరనున్న ఇంటర్ పరీక్షలైనా సజావుగా జరుగుతాయో? లేదో? ననే సందేహం కూడా ప్రతి ఒక్కరిలో లేపకోలేదు. తెలంగాణలో మే 20 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
Also Read: