ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారా? రిజల్ట్స్ తేదీ ఇదిగో

When Will AP EAPCET Results Be Released: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాలు జూన్ 15 నుంచి 18 మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్ ర్యాంకుల్లో 25 శాతం వెయిటేజీ ఉండటంతో, సప్లిమెంటరీ ఫలితాల అనంతరమే ఈఏపీసెట్ ఫలితాలు వెలువడనున్నాయి.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారా? రిజల్ట్స్ తేదీ ఇదిగో
AP Inter Supplementary Result Date

Updated on: Jun 14, 2026 | 7:46 AM

అమరావతి, జూన్ 14: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వీరి నిరీక్షణకు త్వరలోనే తెర పడనుంది. ఈ వారంలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలకానున్నాయి. అందిన సమాచారం మేరకు జూన్ 15 నుంచి 18 తేదీల మధ్య ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఈ ఏడాది ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 5 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జిల్లా కేంద్రాల్లో జూన్ 7 నుంచి 11 వరకు నిర్వహించగా, వాటి మూల్యాంకన ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం. అంతా సవ్యంగా జరిగితే జూన్ 18లోగా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈసారి తొలిసారిగా ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పించడం విశేషం. దీంతో ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైతే ఆ తర్వాత వెనువెంటనే ఈఏపీసెట్ రిజల్ట్స్ కూడా విడుదలకానున్నాయి. ఈఏపీసెట్ ర్యాంకుల నిర్ణయంలో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన తర్వాతే ఈఏపీసెట్ ఫలితాలను ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈఏపీసెట్ అభ్యర్థులు కూడా ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు ఈ వారంలోనే విడుదల కానున్నాయి. ఇంటర్ సప్లిమెంటరీ, ఈఏపీసెట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలకు సెకండ్‌ ఇయర్‌ విద్యార్ధులు దాదాపు1.50 లక్షల మంది హాజరయ్యారు.

Follow Us