
ఆంద్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 60 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్, ఫీమేల్ నర్సింగ్, స్టేషనరీ అటెండెంట్ కమ్ వాచ్‌మెన్, ఫార్మసిస్ట్ గ్రేడ్-2, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 31, 2025వ తేదీ వరకు ఆఫ్‌లైన్ విధానలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, ఎంఎల్‌టీ, బీఎస్సీలో ఉత్తీర్ణతత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా డిసెంబర్ 31, 2025వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నింపిన దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌లో సమర్పించవల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. వికలాంగ అభ్యర్ధులకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 నుంచి రూ.32,670 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోండి.
Office of the District Medical and Health Officer, Parasupeta, Near Nayarbaddi centre, Machilipatnam, Krishna district.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.