నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకో గుడ్ న్యూస్ చెబుతోంది. తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రెగ్యులర్ ప్రతిపదికన ఈ ఉద్యోగాలకు భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ విభాగంలో ఈ నియామకాలను జరుగనున్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌లో మొత్తం 453 ఖాళీలను భర్తీ జరుగనుంది.
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 453 ఉద్యోగలకు ప్రకటన జారీ చేసింది.
1. గైనకాలజీ విభాగంలో 269 ఖాళీలు
2.పీడియాట్రిక్స్ – 11
3.అనెస్తీషియా – 64
4. జనరల్ మెడిసిన్ – 30
5. జనరల్ సర్జన్ – 16
6. ఆర్థోపెడిక్స్ – 12
7. పాథాలజీ – 05
8. ఆప్తాల్మాలజీ – 09
9. రేడియాలజీ – 21
10. సైకియాట్రీ – 02
11. డెర్మటాలజీ – 06
12. ఈఎన్టీ(ENT) – 08
అర్హత- వయసు:
సంబంధిత విభాగాల్లో PG Degree / Diploma / DNB విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జూలై 1 నాటికి 42 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, Ex-service Menకు వయో పరిమితిలో మూడేళ్ల సడలింపు ఇచ్చారు.
ముఖ్య సమాచారం…
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ. 1500లను పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. వేయిని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5: 30 గంటల వరకు..
వెబ్‌సైట్: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://dmeaponline.com/
పోస్టల్ ద్వారా :
ఏదైనా జాతీయ బ్యాంకులో ‘THE COMMISSIONER, AP VAIDYA VIDHANA PARISHAD’ పేరు మీద డీడీ తీసి పంపించాల్సి ఉంటుంది. O/o.Commissioner, APVVP, 4th Floor, B-Block, Himagna Towers, Old NRI college buildings, Gollapudi, Vijayawada Rural, Krishna District, Andhra Pradesh-521225 చిరునామాకు చేరేలా పంపించాలి.
ఎంపిక ఇలా..
అకాడమిక్ మెరిట్, గతంలో పని చేసిన అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 53,500 వరకు వేతనం చెల్లించనున్నారు. మూడేళ్ల ప్రొహిబిషన్ పిరియడ్ అనంతరం వేతన పెంపు ఉంటుంది.