AP Edcet 2026 Exam: ఏపీ ఎడ్‌సెట్‌ 2026 పరీక్ష తేదీ మారింది.. కొత్త షెడ్యూల్ చూశారా?

రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌) 2026 నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమవగా.. శుక్రవారం (మార్చి 27)తో..

AP Edcet 2026 Exam: ఏపీ ఎడ్‌సెట్‌ 2026 పరీక్ష తేదీ మారింది.. కొత్త షెడ్యూల్ చూశారా?
AP Edcet New exam date

Updated on: Mar 27, 2026 | 7:16 AM

అమరావతి, మార్చి 27: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌) 2026 నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమవగా.. శుక్రవారం (మార్చి 27)తో దరఖాస్తు విధానం ముగియనుంది. ఆలస్య రుసుములేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే ఆఖరు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీ ఎడ్‌సెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇక ఏపీ ఎడ్‌ సెట్‌ 2026 ప్రవేశ పరీక్ష తేదీలో కూడా మార్పు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. గతంలో జారీ చేసిన పాత షెడ్యూల్‌ ప్రకారం మే 4న ఎడ్‌ సెట్ ప్రవేశ పరీక్ష జరగాల్సింది ఉంది. అయితే తాజాగా ఈ తేదీలో మార్పులు చేశారు. కొత్త షెడ్యూల్‌ ప్రకారం మే 8, 2026న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. మొదటి షిప్టులో మ్యాథమెటిక్స్‌, బయాలజీ, ఫిజికల్‌ సైన్స్‌ పేపర్లకు ఉదయం 9 నుంచి 11 వరకు పరీక్ష జరగనుంది. ఇక రెండో షిఫ్టులో సోషల్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌ పేపర్లకు మధ్యాహ్నం 2 నుంచి 4వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది ఎడ్‌సెట్‌ పరీక్షను చిత్తూరు జిల్లాలోని ద్రావిడియన్‌ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు ఎవరైనా ఈ రోజు ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.1000 ఆలస్య రుసుముతో మార్చి 29 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 1 వరకు, రూ.4000 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 4 వరకు, రూ.10,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌లో తప్పులు సవరణకు ఏప్రిల్‌ 8, 2026న దరఖాస్తులను సవరించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఈ మేరకు అభ్యర్ధులకు సూచనలు జారీ చేసింది.

ఏపీ ఎడ్‌సెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us