అమరావతి, ఏప్రిల్ 18: ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఏపీఈఏపీ)సెట్‌కు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఏప్రిల్ 15తో ముగిసింది. సోమవారం నాటికి మొత్తం 3,54,235 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సెట్ ఛైర్మన్ జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ కె వెంకటరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. వీటిల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు 2,68,309 దరఖాస్తులు, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌కు 84,791 దరఖాస్తులు, రెండు విభాగాలకు కలిసి 1135 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఈఏపీసెట్‌కు దరఖాస్తుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.
కాగా తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం.. రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 30 వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో మే 5వ తేదీ వరకు, రూ.5 వేల ఆలస్య రుసుంతో మే 10 వ తేదీ వరకు, రూ.10 వేల ఆలస్య రుసుంతో మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పరీక్షల విషయానికొస్తే.. మే 18 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి దరఖాస్తులు ఎక్కువ రావడంతో 23వ తేదీ ఉదయం సెషన్‌లోనూ ఇంజనీరింగ్ పరీక్ష నిర్వహిస్తామని కన్వినర్ వెల్లడించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మే 16, 17 తేదీల్లో పరీక్షలు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడ విశాఖ జిల్లాలో 2024-25 విద్యాసంవత్సరానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలకు ఈ రోజు (ఏప్రిల్ 18) కౌన్సెలింగ్ జరగనుంది. ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్ధులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొని సీట్లు పొందాలని పాఠశాల ప్రిన్సిపల్ వి రత్నవల్లి ప్రకటించారు. ఆయా విద్యార్ధుల ర్యాంకు కార్డు, ఆధార్ కార్డులతోపాటు సంబంధిత డాక్యుమెంట్లతో ఈ రోజు ఉదయం 10 గంటలకు తల్లిదండ్రులతో పాఠశాలకు రావాలని ఆమె పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.