ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీల్లో.. 1458 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్, సైకియాట్రి, రేడియో డయాగ్నోసిస్/రేడియాలజీ, ఎమెర్జెన్సీ మెడిసిన్, డెంటిస్ట్రీ/డెంటల్ సర్జరీ, రేడియోథెరపీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ/సీవీటీ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, నియోనాటాలజీ, ప్రోస్థోడోంటిక్స్, ఓరల్ పాథాలజీ, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ/ఎండోడొంటిక్స్, ఆర్థోడాంటిక్స్, ఓరల్ మాక్సియోల్లో ఫేషియల్ సర్జరీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో డీఎం/ఎంసీహెచ్/ఎండీ/ఎంఎస్/ఎండీఎస్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన స్థానిక అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 19, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.500లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.250లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.65,000ల నుంచి రూ.85,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.