AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెలకు రూ.80,500 వేతనంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగావకాశాలు.. జులై 19 వరకు అప్లై చేసుకోండి

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో 234 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో ఎండీ, ఎంఎస్ లేదా డీఎన్‌బీ అర్హతతో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కలిగిన అభ్యర్థులు జులై 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.80,500 వేతనం అందించనున్నారు..

నెలకు రూ.80,500 వేతనంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగావకాశాలు.. జులై 19 వరకు అప్లై చేసుకోండి
AP DME Senior Resident Recruitment
Srilakshmi C
|

Updated on: Jul 17, 2026 | 1:02 PM

Share

ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా సంచాలక కార్యాలయం (DME) రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 234 ఖాళీలను భర్తీ చేయనుండగా, అర్హత కలిగిన అభ్యర్థులు జులై 15 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎండీ, ఎంఎస్ లేదా డీఎన్‌బీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎంపికైన వారికి నెలకు రూ.80,500 వేతనం చెల్లించనున్నారు.

దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.2,000, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1,000 చెల్లించాలి. పీజీ పరీక్షలో (థియరీ, ప్రాక్టికల్) సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనలు అమలు చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు MD/ MS/ DNBలో ఉత్తీర్ణతతోపాటు AP Medical Councilలో Registration చేసుకుని ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయస్సు 44 సంవత్సరాల వరకు ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 19, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.2,000, BC/ SC/ ST అభ్యర్ధులు రూ.1,000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

Follow Us