
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిలో చేట్టాలని భావించే యువతకు 2026-27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్ 2026) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. ఇంటర్‌లో ఉత్తీర్ణత పొంది విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. డీఈఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్, ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 15, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ డీఈఈసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈఈసెట్) 2026కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఈ ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. అయితే నిర్ధిష్ట గరిష్ఠ వయోపరిమితి లేదు. ఎంత వయసు వారైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నమాట. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 15, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.1,000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. డీఈఈఈసెట్ 2026లో సాధించిన ర్యాంకు ఆధారంగా డీఈఎల్‌ఈడీ (D.EL.Ed) (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల్లో ఒక్కోదానికి 25 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. డీఈఈఈసెట్ 2026 పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.
ఏపీ డీఈఈసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
డీఈఈఈసెట్ 2026 ప్రవేశ పరీక్ష మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో పార్ట్ ఎ 60 ప్రశ్నలకు 60 మార్కులు, పార్ట్ బిలో 40 ప్రశ్నలకు 40 మార్కులు చొప్పున కేటాయిస్తారు.
ఏపీ డీఈఈసెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.