AP 10th re-counting & re-verification: పదో తరగతి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఫీజు చెల్లింపులు ప్రారంభం.. మరో 4 రోజులే ఛాన్స్

పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలంటే మే 7వ తేదీలోపు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన వారికి ఇందుకు అవకాశం ఉంటుంది. విద్యార్ధులు తాము చదువుతున్న స్కూళ్లలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు..

AP 10th re-counting & re-verification: పదో తరగతి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఫీజు చెల్లింపులు ప్రారంభం.. మరో 4 రోజులే ఛాన్స్
AP SSC Recounting and ReVerification Dates

Updated on: May 03, 2026 | 3:51 PM

అమరావతి, మే 3: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల విషయంలో విద్యార్ధులు ఎవరికైనా అనుమానాలు ఉంటే జవాబు పత్రాల రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌ కోరే విద్యార్థులు మే 7వ తేదీలోగా తమ పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌ఎస్‌సీ పరీక్షల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసులు రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్‌కు రూ .500, రీ-వెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. జవాబు పత్రాల రీ వెరిఫికేషన్‌ కోసం పాఠశాల లాగిన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈ ఏడాది నుంచి వాట్సప్‌ గవర్నెన్స్‌ (మన మిత్ర) ద్వారా కూడా పదో తరగతి జవాబు పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

పదో తరగతి ఫలితాల్లో కేవలం కొన్ని మార్కులతో ఫెయిలైన విద్యార్ధులు ఎవరైనా ఉంటే ముందుగా రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల పేపర్ మూల్యాంకనంలో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దే అవకాశం ఉంటుంది. వీరంతా మే 7, 2026వ తేదీలోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 50 ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. రీకౌంటింగ్‌కు ప్రతి సబ్జెక్టుకు రూ. 500, రీ వెరిఫికేషన్‌కు ప్రతి సబ్జెక్టుకు రూ. 1000 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. రీ–కౌంటింగ్, రీ–వెరిఫికేషన్‌కు ఫీజు చెల్లింపులు మే 1, 2026వ తేదీ నుంచి ప్రారంభమైనాయి. మరో 4 రోజులపాటు ఫీజు చెల్లిపులకు అవకాశం ఉంటుంది.

ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి దరఖాస్తును సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us