AP Lawcet 2026 Notification: న్యాయ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ లాసెట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు ఫీజు

రాష్ట్రంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఎల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లా కోర్స్‌ ఎల్‌ఎల్‌ఎం (ఏపీ పీజీఎల్‌సెట్) 2026 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీ..

AP Lawcet 2026 Notification: న్యాయ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ లాసెట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు ఫీజు
AP LAWCET 2026 Notification,

Updated on: Feb 13, 2026 | 6:35 AM

ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు, కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఎల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లా కోర్స్‌ ఎల్‌ఎల్‌ఎం (ఏపీ పీజీఎల్‌సెట్) 2026 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా వరుస నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ ఏడాది లాసెట్‌ పరీక్షను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. అసక్తి కలిగిన అభ్యర్ధులు ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

మూడేళ్లు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం, ఎంఎల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌), ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్‌ లాసెట్‌ (పీజీఎల్‌సెట్) 2026కు దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధిత కోర్సును అనుసరించి 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, పీజీ డిగ్రీల్లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఎటువంటి ఆలస్య రుసుము లేకుండానే మార్చి 12, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఓసీ అభ్యర్థులు రూ.900. బీసీ అభ్యర్థులు 850, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.800 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఓసీ అభ్యర్థులు రూ.1000. బీసీ అభ్యర్థులు రూ.950. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.900 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఇక రాత పరీక్ష అబ్జెక్టివ్‌ విధానంలో మే 4, 2026వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంగ్లిష్‌, తెలుగు మాధ్యమాల్లో, ఎల్‌ఎల్‌ఎం పరీక్ష ఇంగ్లిష్‌ మాధ్యమంలో ప్రవేశ పరీక్షలు జరుగుతాయి.

ముఖ్యమైన తేదీలు..

  • ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 12, 2026.
  • రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: మార్చి 16, 2026.
  • రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: మార్చి 20, 2026.
  • రూ.4000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: మార్చి 24, 2026.
  • రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేది: మార్చి 28, 2026.
  • దరఖాస్తుల సవరణ తేదీ: మార్చి 30, 2026.
  • హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌: ఏప్రిల్ 20, 2026.
  • ప్రవేశ పరీక్ష తేది: మే 4, 2026.
  • ప్రాథమిక కీ విడుదల తేదీ: మే 7, 2026 .
  • ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ: మే 9, 2026.
  • లా సెట్‌ ఫలితాలు విడుదల తేదీ: మే 18, 2026.

ఏపీ లా సెట్, పీజీఎల్ సెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.