AP Inter Syllabus 2026: ఇంటర్ 2nd ఇయర్‌ కొత్త సిలబస్ లిక్‌ వ్యవహారంలో బిగ్‌ ట్విస్ట్.. కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సెకండ్‌ ఇయర్‌ కొత్త సిలబస్ అధికారిక విడుదలకు ముందే లీక్ అయింది. పాఠ్యపుస్తకాల ముద్రణకు ముందే కెమిస్ట్రీ, ఫిజిక్స్ పీడీఎఫ్‌లు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో ప్రచురణకర్తలయిన తెలుగు అకాడమీకి నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంలో వారు తమ పాత్రను ఖండించి సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించారు. విచారణ కొనసాగుతోంది..

AP Inter Syllabus 2026: ఇంటర్ 2nd ఇయర్‌ కొత్త సిలబస్ లిక్‌ వ్యవహారంలో బిగ్‌ ట్విస్ట్.. కేసు నమోదు
AP Inter second Year new syllabus leaked

Updated on: Mar 26, 2026 | 9:11 AM

అమరావతి, మార్చి 26: ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ సెకండ్ ఇయర్ కొత్త సిలబస్ లీక్ వ్యవహారంలో కేసు నమోదైంది. తెలుగు సంస్కృత అకాడమీ డిప్యూట్ డైరక్టర్ కోటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే..

2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్‌లో ప్రభుత్వం కొత్త సిలబస్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తెలుగు అకాడమీ, ఇంటర్ బోర్డు నుంచి సిలబస్ విడుదల చేయకముందే సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులో న్యూ సిలబస్ పీడీఎఫ్ క్లిప్పింగ్స్ ప్రత్యక్షమయ్యాయి. కొత్తగా ప్రవేశపెడుతున్న సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ సిలబస్ లీక్ అవడంపై VGS పబ్లిషర్స్ కు తెలుగు అకాడమీ నోటీసులు ఇచ్చింది. కొత్త సిలబస్ బుక్స్ ప్రింటింగ్ కు ముందే కెమిస్ట్రీ, పీజిక్స్ సిలబస్ పీడీఎఫ్‌లు లీకయినట్లు గుర్తించింది. దీంతో తెలుగు, సంస్కృత అకాడమీ డిప్యూటి డైరక్టర్‌ కంప్లైంట్ చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు ఇంటర్మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ పాఠ్య పుస్తకాలు ముద్రించకముందే పీడీఎఫ్‌లు సామాజిక మాధ్యమాల్లో రావడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. వీజీఎస్‌కు ఇచ్చిన వర్క్‌ఆర్డర్‌ను రద్దు చేయాలని తెలుగు, సంస్కృత అకాడమీ డైరెక్టర్‌ రంజిత్‌ బాషాను ఆదేశించింది. వీజీఎస్‌ వద్ద నుంచే పీడీఎఫ్‌లు లీకైనట్లు తేలడంతో ఆ సంస్థపై క్రిమినల్‌ కేసు పెట్టాలని చెప్పింది.

ఇవి కూడా చదవండి

2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఉచితంగా, ప్రైవేటు వారికి మార్కెట్‌లో పుస్తకాలు అందుబాటులో ఉంచేందుకు ఇటీవల తెలుగు, సంస్కృత అకాడమీ టెండర్లు పిలిచింది. వీజీఎస్‌ ముద్రణ బాధ్యతలు చేపట్టింది. అయితే పుస్తకాలు ముద్రించకుండానే పీడీఎఫ్‌లు బయటకు వచ్చేశాయి. పలు ప్రైవేట్‌ కాలేజీల చేతికి అవి చేరినట్లు సమాచారం. అయితే వీజీఎస్ యాజమాన్యం మాత్రం గుర్తుతెలియని వ్యక్తులు తమ ఈ-మెయిల్‌ను హ్యాక్‌ చేసి, పీడీఎఫ్‌లు తీసుకున్నట్లు చెబుతోంది. సైన్సు గ్రూపులకు సంబంధించిన దాదాపు అన్ని పీడీఎఫ్‌లు బయటకు వచ్చినట్లు అకాడమీ గుర్తించింది. ఆ వ్యవహారంపై తెలుగు, సంస్కృత అకాడమీ డిప్యుటీ డైరెక్టర్‌ విజయవాడ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లీకైనా పాఠ్య పుస్తకాల పీడీఎఫ్‌లను ఉపయోగించి ప్రైవేటు కాలేజీలు సొంతంగా ముద్రణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలుగు, సంస్కృత అకాడమీ ఛైర్మన్‌ ఆర్‌డీ విల్సన్‌ హెచ్చరించారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us