AP 10th & Inter Result Dates 2026: ఈ నెల్లోనే టెన్త్, ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఏయే తేదీల్లోనంటే?

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2026 ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్ధుల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. చకచకా మూల్యాంకనం పూర్తి చేసి ఈ ఏడాది ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు..

AP 10th & Inter Result Dates 2026: ఈ నెల్లోనే టెన్త్, ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఏయే తేదీల్లోనంటే?
AP 10th Class and Inter Result Dates

Updated on: Apr 05, 2026 | 2:25 PM

అమరావతి, ఏప్రిల్‌ 5: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2026 ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్ధుల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. చకచకా మూల్యాంకనం పూర్తి చేసి ఈ ఏడాది ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ నెలలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెలాఖరు నాటికి పది రోజుల తేడాతో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇంటర్మీడియట్‌ పరీక్ష పత్రాల మూల్యాంకనం ఏప్రిల్‌ 9న ముగుస్తుంది. ఆ తర్వాత మార్కుల ఎంట్రీ ప్రక్రియ ఉంటుంది . ఈ క్రమంలో ఫలితాల విడుదల ప్రక్రియకు 5 నుంచి ఆరు రోజులు సమయం పడుతుంది. దీంతో ఫలితాలు ఏప్రిల్‌ మూడో వారంలో 15వ తేదీ తర్వాత ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు కసరత్తు చేస్తోంది.

అనంతరం పదో తరగతి ఫలితాలను ఏప్రిల్‌ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్‌ 6 నుంచి 15 వరకు సాగుతుంది. ఫలితాలను ప్రాసెస్‌ చేయడానికి మరో 10 రోజులు పడుతుంది. అంటే ఏప్రిల్‌ 25వ తేదీ తర్వాత పదో తరగతి ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తుంది. గత సంవత్సరం పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 23న ప్రకటించారు. కాగా మార్చి 16న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2న ఇంగ్లీష్ పేపర్‌తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు మొత్తం 6,40,916 మంది విద్యార్థులకు హాజరయ్యారు. వీరిలో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us