AP High Court Jobs 2022: డిగ్రీ అర్హతతో రాత పరీక్షలేకుండా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర జీతం..

|

Oct 04, 2022 | 8:52 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 76 కోర్టు మాస్టర్ అండ్‌ పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది..

AP High Court Jobs 2022: డిగ్రీ అర్హతతో రాత పరీక్షలేకుండా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర జీతం..
AP High Court Recruitment 2022
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 76 కోర్టు మాస్టర్ అండ్‌ పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆర్ట్స్/సైన్స్/కామర్స్.. ఏదైనా విభాగాల్లో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్ వచ్చి ఉండాలి. హయ్యర్ గ్రేడులో ఇంగ్లిష్‌ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందినట్లు సర్టిఫికేట్‌ ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్‌ 22, 2022వ తేదీలోపు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌హ్యాండ్ ఇంగ్లిష్ టెస్ట్, ఇంటర్వ్యూ, విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల వరకు జీతం చెల్లిస్తారు. ఇతర ముఖ్య సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.