తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు మొదలు.. ఇలా వెంటనే అప్లై చేయండి!
Telangana Gurukula Admissions: తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే టీఆర్‌ఈఐఎస్ నిర్వహిస్తున్న గురుకుల విద్యాసంస్థలు నాణ్యమైన విద్యకు ప్రసిద్ధి చెందాయి. ఈ జూనియర్ కళాశాలలు అద్భుత ఫలితాలతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయి. ఇప్పుడు వీటిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విద్యార్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలి.
గురుకుల విద్యాసంస్థలు నాణ్యమైన విద్యకు ప్రసిద్ధి చెందాయి. ఈ గురుకులాల జూనియర్ కళాశాలలు రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలు సాధిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయి. ఇక్కడ విశాలమైన క్యాంపస్‌లు, ఆధునిక తరగతి గదులు, సౌకర్యవంతమైన వసతి, పోషకాహారం, అనుభవజ్ఞులైన అధ్యాపకులు వంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అదనంగా, ఇంటర్ చదివే విద్యార్థులకు EAPCET, NEET వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ ఉన్నత స్థాయికి చేరేలా మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు అర్హులు.
ప్రవేశాలు ఎలా ఉంటాయి?
ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ విధానం ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
రిజర్వేషన్ శాతం ఇలా ఉంది:
జనరల్ – 50%
ఎస్టీ – 10%
ఎస్సీ – 12%
బీసీ – 15%
క్రీడా కోటా – 3%
దివ్యాంగులు – 3%
ఆర్మీ – 1%
ఈడబ్ల్యూఎస్ – ప్రత్యేకంగా 4 సీట్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీట్లు
తెలంగాణలో మొత్తం 35 గురుకులాలు ఉండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 ఉన్నాయి. హసన్‌పర్తి, వంగర, నెక్కొండ, కొడకండ్ల వంటి ప్రాంతాల్లో బాలికల గురుకులాలు, వేలేరు, బండారుపల్లి ప్రాంతాల్లో బాలుర గురుకులాలు ఉన్నాయి.