Solar Powered Village: సరికొత్త రికార్డు.. కరెంట్ బిల్లులు జీరో.. దేశంలోనే తొలి 100% సోలార్ గ్రామం..!

Solar Powered Village: గ్రామస్తులు తమ అవసరాల కోసం మిగిలిన అదనపు విద్యుత్తును విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌కు సరఫరా చేయడం ద్వారా ఆదాయాన్నిచ్చే శక్తి ఉత్పత్తిదారులుగా మారారు. 141 కుటుంబాలలో 93 కుటుంబాలు మొదటి రోజు నుండే సౌర విద్యుత్తును పొందాయి.

Solar Powered Village: సరికొత్త రికార్డు.. కరెంట్ బిల్లులు జీరో.. దేశంలోనే తొలి 100% సోలార్ గ్రామం..!
Solar Powered Village

Updated on: Nov 03, 2026 | 5:06 PM

Solar Powered Village: ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాకు చెందిన మారుమూల గ్రామం ‘ఖైరా’ దేశ చరిత్రలో ఒక సరికొత్త మైలురాయిని సాధించింది. ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ కింద వంద శాతం సోలార్‌ శక్తిని సాధించిన భారతదేశపు మొట్టమొదటి గ్రామంగా ఖైరా అవతరించింది.

ఈ ప్యానెళ్లు అక్కడ నివసిస్తున్న 889 మంది నివాసితుల 282 కిలోవాట్ల విద్యుత్ అవసరాన్ని తీరుస్తున్నాయి. ఈ విప్లవాత్మక మార్పు కోసం గ్రామస్తులు ఎటువంటి ఆర్థిక భారం భరించాల్సి రాలేదు. కొంత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీల ద్వారా భరించగా, మిగిలిన మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా చెల్లించారు. నివాసితులు తమ జేబు నుండి ఎలాంటి ఖర్చులూ చేయనవసరం రాలేదు. దీంతో ఇళ్ల యజమానులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఈ సోలార్‌ ప్యానెల్స్‌ను బిగించారు.

ఇది కూడా చదవండి: RBI Notes: దీపావళికి రూ.10, రూ.20, రూ.50 నోట్ల కొరత? ఆర్బీఐ సంచలన ప్రకటన

ఇవి కూడా చదవండి

గ్రామస్తులు తమ అవసరాల కోసం మిగిలిన అదనపు విద్యుత్తును విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌కు సరఫరా చేయడం ద్వారా ఆదాయాన్నిచ్చే శక్తి ఉత్పత్తిదారులుగా మారారు. 141 కుటుంబాలలో 93 కుటుంబాలు మొదటి రోజు నుండే సౌర విద్యుత్తును పొందాయి.

అయితే 889 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలోని మొత్తం 141 ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఈ గ్రామం సుమారు 282 కిలోవాట్ల (kW) క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. ప్రతి ఇంటిపై 2 కిలోవాట్ల సోలార్ యూనిట్‌ను అమర్చారు.

కరెంట్ బిల్లుల బాధ తప్పింది:

గతంలో పేద కుటుంబాలకు కరెంటు బిల్లులు చెల్లించడం పెనుభారంగా ఉండేది. ఇప్పుడు సోలార్‌ పవర్‌ అందుబాటులోకి రావడంతో పింఛన్‌పై ఆధారపడే వృద్ధులు, వితంతువులు, దైనందిన కూలీలు కరెంట్ బిల్లుల టెన్షన్‌ లేకుండా పోయింది.

ఇది కూడా చదవండి: GST Notice: పని మనిషికి రూ.4.75 కోట్ల జీఎస్టీ నోటీసు.. మహిళకు భారీ షాక్‌.. అసలేం జరిగిందంటే..!

ఇది కూడా చదవండి: Nita Ambani: రోజూ రూ.50 లక్షల వాటర్ తాగుతున్న నీతా అంబానీ? వైరల్ ఫొటో వెనుక అసలు నిజం ఇదే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us