అంబానీ ఏం తింటాడో తెలిస్తే షాక్ అవుతారు..

| Edited By: Ravi Kiran

Nov 08, 2024 | 10:00 PM

ముఖేష్ అంబానీ అహార అలవాట్లు, జీవన శైలీ, వర్కట్స్ కు సంబంధించి ఆయన భార్య నీతా అంబానీ పలు ఆశక్తికర విషయాలు వెల్లడించారు. ప్రతి రోజువారీ ఉదయం ఉదయం 5:30 గంటలకు నిద్ర మేల్కొనే అంబానీ అల్పహారంగా తెలికైన అహారం తీసుకుంటాడట. అంతే కాదు భోజనంగా గుజరాతి సాంప్రదాయ వంటకాలను తీసుకుంటాడట. రెడ్ మీట్, మసాల వంటకాలతో పాటు మద్యపానం, జంక్ ఫుడ్ ను అస్సలు తీసుకోరట. ఇక ప్రతి రోజు యోగా, వాకింగ్ తప్పకుండా చేస్తారట.

అంబానీ ఏం తింటాడో తెలిస్తే షాక్ అవుతారు..
Mukesh Ambani
Follow us on

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే పేరుగాంచిన వ్యాపార వేత్త. మన దేశంలో బిజినెస్ ప్రపంచాన్ని శాసిస్తున్న ముఖేష్ అంబానీ వ్యాపార రంగంలో రాణించాలనుకునే ఎంతో మందికి ఆదర్శం.. వ్యాపార రంగంలోనే కాదు జీవన శైలి, ఆహార అలవాట్లతో కూడా ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నాడు ఈ బిజినెస్ టైకూన్.  ముఖేష్ అంబానీ భార్య రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ అయిన నీతా అంబానీ ఇటీవల ఓ ఇంటర్వూలో ముఖేష్ అంబానీ గురించి పలు ఆశక్తికర విషయాలను పంచుకున్నారు. అంబానీ డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది. జీవన శైలి, అహార అలావాట్లను గురించి తెలియజేశారు.

అల్పహారం

ప్రతి రోజువారీ ఉదయం ఉదయం 5:30 గంటలకు నిద్ర మేల్కొనడంతో ముఖేష్ అంబానీ దినచర్య మొదలవుతుంది. అల్పాహారంలో తాజా పండ్లు, జ్యూస్‌తో పాటు దక్షిణాదిలో ఫేమస్ అయిన ఇడ్లీ- సాంబార్ ను అల్పహారంగా తీసుకుంటారట. ఉదయాన్నే మంచి పోషకాలున్న తేలికపాటి అల్పహారాన్ని తీసుకోవడంతో రోజంతా అలసి పోకుడా మంచి శక్తితో ఉండవచ్చట.

నో జంక్ ఫుడ్

ముఖేష్ అంబానీ ఆర్థిక క్రమశిక్షణను ఎంతగా ఫాలో అవుతాడో అహార క్రమశిక్షణను కూడా అంతే పద్దతిగా ఫాలో అవుతాడట. ఆల్కహాల్, జంక్ ఫుడ్ వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉంటారట. అయితే వారానికి ఒకసారి మాత్రమే బయట ఫుడ్ తీసుకుంటాడట. మిగితా రోజుల్లో ఇంట్లో ప్రత్యేకంగా వండిన భోజనం మాత్రమే భుజిస్తాడట. గుజరాతీ వంటకాలతో కూడిన శాఖాహారాన్ని మాత్రమే ముఖేష్ తీసుకుంటాడని నీతా తెలిపారు.  భోజనంలో అన్నం పప్పుతో పాటు వివిధ రకాల కూరగాయలు ఉంటాయి. సలాడ్‌లు, సూప్‌లకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందట. రెడ్ మీట్‌లు తో పాటు అధికంగా మసాలా ఉండే వంటకాలు ఎట్టి పరిస్థితుల్లో తన ప్లేట్ దరిచేరయట.

మానసిక ప్రశాంతత

అంబానీ తీసుకునే అహారం శారీరానికి మాత్రమే కాదు మానసికంగా మనస్సును ఉల్లాసంగా ఉంచుతుందట. అందుకే ఎక్కువగా మొక్కల ఆధారిత అహారాన్ని మాత్రమే తీసుకుంటాడట. ముఖేష్ తినే అహారంపై ఎంత శ్రద్ద వహిస్తాడో జీవనశైలి విషయంలో అంతే ప్రత్యేక షెడ్యూల్ ని ఫాలో అవుతాడట. ప్రతి రోజు మెడిటేషన్, యోగా తో పాటు రెగ్యులర్ వాకింగ్‌ చేస్తాడట.. దీంతో రోజంతా ఒత్తిడిని తగ్గించడంతో పాటు మనసికంగా ఉంతో ఉత్సాహంగా ఉంచేలా చేస్తాయట. ధ్యానం, యోగా స్థిరమైన మనస్థత్వంతో ఉండేలా చేస్తే వ్యాయామం, వాకింగ్ వంటివి రోజంతా ఎంతో ఎనర్జీతో పని చేయడానికి దోహదం చేస్తాయట.

ముఖేష్‌ అంబానీ ఎలాంటి కఠినమైన వర్కట్ లు చేయకుండానే 15 కిలోల బరువు తగ్గాడట. స్థిరమైన అహార పద్దతులు పాటిస్తూనే, జంక్ ఫుడ్, మసాల ఫుడ్ కు దూరంగా ఉంటునే క్రమశిక్షణ కలిగిన జీవన శైలితో నే బరువు తగ్గడం సులభం అని నిరూపించారు ముఖేష్ అంబానీ. అందుకే  బిజీ లైఫ్, పని ఒత్తిడి ఉన్న వారు ముఖేష్ అంబానీ లైఫ్ స్టైల్, అహార అలవాట్ల, క్రమశిక్షణ నుంచి ఖచ్చితంగా స్పూర్తిపొందాల్సిందే.