Xiaomi – India: ఎంఐ 11ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ భారత్‌లో విడుదల.. అద్భుతమైన ఫీచర్లు..

|

Apr 23, 2021 | 2:24 PM

Xiaomi - India: మొబైల్‌ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో రోజురోజుకు పలు బ్రాండ్ల మొబైళ్లను భారత మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. పోటాపోటీగా కస్టమర్లను ఆకర్షించే విధంగా...

Xiaomi - India: ఎంఐ 11ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ భారత్‌లో విడుదల.. అద్భుతమైన ఫీచర్లు..
Xiaomi India
Follow us on

Xiaomi – India: మొబైల్‌ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో రోజురోజుకు పలు బ్రాండ్ల మొబైళ్లను భారత మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. పోటాపోటీగా కస్టమర్లను ఆకర్షించే విధంగా పలు మొబైల్‌ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లను జోడిస్తూ కొత్త మొబైళ్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా ఎంఐ నుంచి మరో మొబైల్‌ ఈ రోజు విడుదల కానుంది. ఎంఐ 11 ఎక్స్‌ సిరీస్‌ భారత్‌ల ఏప్రిల్‌ 23న విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని షియోమీ ప్రెస్ రిలీజ్ ద్వారా తెలిపింది. అయితే ఈ ఇన్వైట్‌లో ఎంఐ ఎక్స్ సిరీస్ అని పేర్కొన్నారు. కానీ ఇవి ఎంఐ 11ఎక్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎంఐ 11 ఎక్స్ సిరీస్ ఫోన్లలో ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఫోన్లూ రెడ్ మీ కే40, రెడ్ మీ కే40 ప్రో ప్లస్‌లకు రీబ్రాండెడ్ వెర్షన్‌లుగా రానున్నాయని తెలుస్తోంది. రెడ్ మీ కే40 సిరీస్ చైనాలో లాంచ్ అయింది. మనదేశంలో ఇంతవరకు ఇవి లాంచ్ కాలేదు. తాజాగా ఇవి భారత్‌లో విడుదల కానున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో ఉండనున్నాయి. రెడ్ మీ కే40కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఎంఐ 11ఎక్స్, రెడ్ మీ కే40 ప్రో మ్యాక్స్‌కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఎంఐ 11ఎక్స్ ప్రో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్లు…!

ఈ రెండు మొబైళ్లలోనూ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను ఉండే అవకాశం ఉంది. వీటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఎంఐ 11ఎక్స్‌లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, ఎంఐ 11ఎక్స్ ప్రోలో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ అందించే అవకాశం ఉంది. 12 జీబీ వరకు ర్యామ్ 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది.

కెమెరాలు..

ఎంఐ 11ఎక్స్‌లో వెనకవైపు మూడు కెమెరాలు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా, ఇక ఎంఐ 11ఎక్స్ ప్రోలో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండే అవకాశం ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4520 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.

ధరలు ఇలా ఉండే అవకాశం…

మి 11 ఎక్స్‌ 8 జిబి + 128 జిబి: రూ .29,990
మి 11 ఎక్స్ 8 జిబి + 256 జిబి: రూ 31,990
మి 11 ఎక్స్ ప్రో 8 జిబి + 128 జిబి: రూ 36,990
మి 11 ఎక్స్ ప్రో 8 జిబి + 256 జిబి: రూ .38,990

ఇవీ చదవండి: Oppo A53s 5G Phone : ఒప్పో A53s 5G ఫోన్ భారత్‌లో ఏప్రిల్ 27 న విడుదల.. ధర రూ.15 వేలు.. అద్భుతమైన ఫీచర్లతో..

Online Shopping: మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి