Fast Charging Battery: 10 నిమిషాల చార్జింగ్‌తో 400 కిలోమీటర్లు ప్రయాణం.. ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ బ్యాటరీ ఇదే..

|

Aug 21, 2023 | 6:00 PM

ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాటరీ తయారీ సంస్థ కాన్ టెంపరరీ యాంపెరెక్స్ టెక్నాలజీ లిమిటెడ్(సీఏటీఎల్) ఓ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీని ఆవిష్కరించింది. ఈ బ్యాటరీ కేవలం 10 నిమిషాల చార్జింగ్ తో 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని వివరించింది.  లిథియం ఐయాన్ బ్యాటరీల సెగ్మెంట్ లో ఇది సరికొత్త చరిత్రకు నాంది పలుకుతుందని ఆ కంపెనీ ప్రకటించింది.

Fast Charging Battery: 10 నిమిషాల చార్జింగ్‌తో 400 కిలోమీటర్లు ప్రయాణం.. ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ బ్యాటరీ ఇదే..
Electric Car Charging
Follow us on

విద్యుత్ శ్రేణి వాహనాల్లో ప్రధాన సమస్య బ్యాటరీ చార్జింగ్ టైం. అవి కార్లైనా, ద్విచక్ర వాహనాలైనా ఫుల్ చార్జింగ్ కావాడానికి కొన్ని గంటల పాటు సమయాన్ని తీసుకుంటాయి. ఇప్పుడు దీనికి పరిష్కారాన్నిచైనాకు చెందిన కంపెనీ కనుగొంది. ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాటరీ తయారీ సంస్థ కాన్ టెంపరరీ యాంపెరెక్స్ టెక్నాలజీ లిమిటెడ్(సీఏటీఎల్) ఓ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీని ఆవిష్కరించింది. ఈ బ్యాటరీ కేవలం 10 నిమిషాల చార్జింగ్ తో 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని వివరించింది.  లిథియం ఐయాన్ బ్యాటరీల సెగ్మెంట్ లో ఇది సరికొత్త చరిత్రకు నాంది పలుకుతుందని ఆ కంపెనీ ప్రకటించింది. కార్ల యాజమానులకు ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుందని, గంటలు, గంటలు చార్జింగ్ కోసం వెచ్చించాల్సి అవసరం ఉండదని పేర్కొంది. ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ అయితే ఏకంగా 700 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బ్యాటరీ తయారీ ఇలా..

సీఏటీఎల్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ వూ కై మాట్లాడుతూ ఈ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్, అధిక బ్యాటరీ కెపాసిటీని తాము సరికొత్త సూపర్ కండక్టింగ్ ఎలక్ట్రోలైట్ ఫార్ములా తో అభివృద్ధి చేశామన్నారు. ఈ సరికొత్త ఈవీ బ్యాటరీ టెక్నాలజీ భవిష్యత్తును వేగంగా స్థిరంగా దీనిని నడిపిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక పరమైన ప్రయోజనాలను కూడా అందిస్తుందని పేర్కొన్నారు. ఈ అడ్వాన్స్ డ్ ఫీచర్ కేవలం ధనవంతులకే కాక అన్ని వర్గాల వారికి కూడా అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీ ఫలాలు అందరికీ అందాలన్నదే తమ ఉద్దేశమని, అందుకే పూర్తి ఎకనామికల్ గా దీనిని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

ఏ బ్రాండ్ కారుకు వస్తుంది  ఈ బ్యాటరీ..

సీఏటీఎస్ తన పోటీదారుల కన్నా 2022లో అధిక లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేసింది. ఇప్పుడు వచ్చే ఏడాదికి కూడా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే ఈ ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీలు మొదటిగా ఏ కంపెనీకి అందిస్తున్నామనేది కంపెనీ రివీల్ చేయలేదు. అయితే బీఎండబ్ల్యూ, డైమ్లర్, ఏజీ, హోండా, టెస్లా, టోయోటా, వోక్స్ వ్యాగన్, వోల్వో వంటి టాప్ బ్రాండ్లు సీఏటీఎల్ కస్టమర్లుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్..

గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది అయితే రికార్డు స్థాయిలో 10 మిలియన్ల కార్లు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడయ్యాయి. రానురానూ వీటికి మరింత డిమాండ్ వచ్చే పరిస్థితి ఉంది. ఇక లాంటి ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీలు, చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తే ఇవి మరింత విరివిగా అమ్ముడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..