PPF Investment: రోజుకు రూ.417 పెట్టుబడితో ఏకంగా రూ.2.27 కోట్ల రాబడి.. ఆ పథకంలో పెట్టుబడితోనే సాధ్యం

| Edited By: Ravi Kiran

Nov 28, 2023 | 8:30 PM

పీపీఎఫ్‌ ప్రభుత్వ మద్దతుతో పాటు అధిక రాబడినిచ్చే చిన్న పొదుపు కార్యక్రమం. ముఖ్యంగా పదవీ విరమణ కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. ఈఈఈ వర్గీకరణతో స్థిరమైన సంపదతో వచ్చే ఈ పథకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పథకం కింది రోజుకు రూ.417 పెట్టుబడితో రూ.2.27 కోట్ల రాబడి ఎలా పొందవచ్చో? ఓ సారి తెలుసుకుందాం.

PPF Investment: రోజుకు రూ.417 పెట్టుబడితో ఏకంగా రూ.2.27 కోట్ల రాబడి.. ఆ పథకంలో పెట్టుబడితోనే సాధ్యం
Ppf
Follow us on

కష్టపడి సంపాదించిన డబ్బు కోసం సురక్షితమైన రాబడి పొందాలని కోరుకునే వారికి కోసం వివిధ పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీరిలో ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) ఒక అనుకూలమైన ఎంపికగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో రిస్క్ లేని దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు పీపీఎఫ్‌ మంచి అవకాశమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. పీపీఎఫ్‌ ప్రభుత్వ మద్దతుతో పాటు అధిక రాబడినిచ్చే చిన్న పొదుపు కార్యక్రమం. ముఖ్యంగా పదవీ విరమణ కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు. ఈఈఈ వర్గీకరణతో స్థిరమైన సంపదతో వచ్చే ఈ పథకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ పథకం కింది రోజుకు రూ.417 పెట్టుబడితో రూ.2.27 కోట్ల రాబడి ఎలా పొందవచ్చో? ఓ సారి తెలుసుకుందాం.

మైనర్‌లు లేదా మానసిక స్థితి సరిగా లేని వ్యక్తుల తరపున వ్యవహరించే సంరక్షకులు కనీసం రూ. 500, వార్షిక పరిమితి రూ. 1.5 లక్షలతో పీపీఎఫ్‌లో ఖాతాను ప్రారంభించవచ్చు. ఇది విస్తృత శ్రేణి పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఆర్థిక ల్యాండ్‌స్కేప్‌లో చేరికను ప్రోత్సహిస్తుంది. పీపీఎఫ్‌ ఖాతాలో రోజు రూ.417 అంటే నెలకు కేవలం రూ. 12,500 లేదా సంవత్సరానికి రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ. 2.27 కోట్లు పొందవచ్చు. 

పీపీఎఫ్‌ ఖాతాలు 15 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధితో వస్తాయని గమనించడం ముఖ్యం. ఐదేళ్ల బ్లాక్‌లలో వీటిని పొడిగించవచ్చు. 20 ఏళ్లకు మించి కొనసాగడానికి పెట్టుబడిదారులు ఫారమ్ 16 హెచ్‌ని సమర్పించాలి. పీపీఎఫ్‌ ఖాతాను 20 సంవత్సరాలకు మించి పొడిగించడం వల్ల గణనీయమైన సంపద సృష్టిస్తుంది. ఉదాహరణకు నెలవారీగా రూ. 12,500 లేదా రూ. 1.50 లక్షల పెట్టుబడి పెడితే, ప్రస్తుత పీపీఎఫ్‌ వడ్డీ రేటు 7.10 శాతంగా పరిగణించి, రూ. 2,26,97,857 లేదా దాదాపు రూ. 2.27 కోట్ల మెచ్యూరిటీ మొత్తాన్ని పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..