కూరగాయల నుండి కిరాణం వరకు.. ఒక్క నెలలోనే భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు!

సామాన్య ప్రజలకు నిత్యావసర ధరలు షాకిస్తున్నాయి. గత నెలతో పోల్చుకుంటే.. రోజూ తినే కూరగాయల, బియ్యం, పప్పు, అల్లం అనుంచి గ్యాస్ వంటి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఈ భారీ పెరుగుదల సమాన్యుడి నెలవారి జీవితంపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుంది. యుద్ధం పరిణామాలు, వర్షాభావ పరిస్థితులే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఏ వస్తువులపై ధరలు ఎంత మేర పెరిగాయో ఇక్కడ చూద్దాం.

కూరగాయల నుండి కిరాణం వరకు.. ఒక్క నెలలోనే భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు!
Rising Grocery Prices

Updated on: Jul 17, 2026 | 8:35 AM

గత మూడు నెలల క్రితం ఎక్కడో పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం సెగలు వేడి ఇప్పటికీ మన దేశంలోని సమాన్య ప్రజలకు తగులుతుంది. ఈ యుద్ధ పరిణామాలు, అటు వర్షాభావ పరిస్థితుల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగి సమాన్యుడి నెలవారి జీవితంపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. సరిగ్గా వర్షాలు కురవక ఉత్పత్తులు తగ్గి సరఫరా సరిగ్గా లేకపోవడంతో పాటు యుద్దం కారణంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా ఖర్చులు సైతం పెరిగి.. కూరగాయల నుంచి కిరాణ వస్తువుల వరకు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటున్నాయి.

గత నెలలో పెట్రోల్, గ్యాస్, టమాటా, ఎండు మిర్చీ వంటి కూరగాయల ధరలతో మొదలైన పెరుగుదల ఇప్పు బియ్యం, పప్పు, ఉల్లి, అల్లం, వెల్లుల్లి వరకు చేరింది. గత నెలలో క్వింటాల్‌కు రూ. 1300 గా ఉన్న బియ్యం ధర ప్రస్తుతం రూ.1600 వందలకు చేరినట్టు స్థానికి కిరాణ షాపు యజమానులు చెబుతున్నారు. కిరాణ సరుకులకు తోడు నిత్యావసర వస్తువులైన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలతో సామాన్య మధ్యతరగతి కుంటుంబాల నెలవారి ఖర్చులు సైతం గత నెలతో పోల్చుకుంటే భారీ పెరిగినట్టు తెలుస్తోంది.

ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, వైద్యం, కరెంటు బిల్లు ఇలా నెల తిరగే వరకు వచ్చే ఖర్చులకు నెల జీతం ఏమాత్రం సరిపోవట్లేదని సమాన్య ప్రజలు వాపోతున్నారు.. ఉన్న జీతాలు అలానే ఉన్నాయి కానీ ఖర్చులు మాత్రం భారీ పెరిగిపోతున్నాయని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. సాధారణంగా ఒక నెలలో నలుగురు సభ్యులు ఉన్న చిన్న ఫ్యామిలీకి అయ్యే ఖర్చు చూసుకుంటే.. గత నెలతో కంటే ప్రస్తుతం పెరిగిన ధరలతో ఒక్కో ఫ్యామిలీపై దాదాపు రూ.2500 వరకు భారం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇది మధ్య తరగతి కుంటుంబాలను ఇంకా ఆర్థిక కష్టాల్లోకి నెడుతుందని చెబుతున్నారు.

గత నెలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు ఇలా 

వస్తువు జూన్ తొలివారంలో ప్రస్తుతం
అల్లం 140 210-230
ఎల్లిగడ్డ 140-160 210-450
ఎండుమిర్చి 230-245 320
చింతపండు 140 180
పచ్చజొన్నలు 55-60 75
తెల్లజొన్నలు 35-40 55
మినపప్పు 110 140
చక్కెర 42 48
ఉల్లిగడ్డ 22 35
మొరంగడ్డ 25 33
పచ్చిమిర్చి 45 55

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us