
ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. అందులో భాగంగా మరో ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. అదే సైడ్ చాట్ ఫీచర్. వినియోగదారులకు మరింత ప్రైవసీని అందించేందుకు ఈ ఫీచర్ తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు సపరేట్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో ఛాట్‌లకు మరింత ప్రైవసీ, సెక్యూరిటీ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫీచర్ ద్వారా మోటా ఏఐ సాయాన్ని ప్రైవేట్‌గా యూజర్లు పొందవచ్చు. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్‌లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. క్రోమ్ బ్రౌజర్‌లో ఇన్‌కాగ్నిటో చాట్ మోడ్ ఫీచర్ వల్లే వాట్సప్ కూడా ఇన్ కాగ్నిటో మోడ్‌ను ప్రారంభించింది.
గత నెలలో మోటా ఏఐతో కన్వర్జేషన్ కోసం ఇన్ కాగ్నిటో మోడ్‌ను వాట్సప్ ప్రారంభించింది. దీంతో సెక్యూరిటీ కోసం వాట్సప్‌లో కూడా ఇన్‌కాగ్నిటో మోడ్ స్టార్ట్ చేసింది. దీని వల్ల మోటా ఏఐ బాట్ మధ్య జరిగే చాట్‌లకు పూర్తి ప్రైవసీ, భద్రత ఉంటుంది. వాట్సప్‌లో మనం ఎవరితోనైనా చాట్ చేస్తున్న సమయంలో మెటా ఏఐను యాక్సెస్ చేయడానికి సైడ్ చాట్ ఫీచర్‌ను వాట్సప్ తీసుకొచ్చింది. దీని వల్ల యూజర్లు ఇన్‌స్టంట్‌గా చాట్స్‌లో మెటా ఏఐను యాక్సెస్ చేయవచ్చు. ఇక మీరు ఛాటింగ్ చేస్తున్న సమయంలో ఏఐను వాడుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రైవసీ ప్రోటోకాల్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇన్ కాగ్నిటో మోడ్ వల్ల మీ కన్వర్జేషన్‌ను ఎవరూ చదవలేరు. మెటా కూడా మీ కన్వర్జేషన్‌ను చూడలేదు. యూజర్లకు పూర్తిగా ప్రైవసీ, భద్రత కల్పించేందుకు మెటా ఈ ఫీచర్ తీసుకొచ్చింది.
వాట్సప్ చాట్‌లో కన్వర్జేషన్ స్క్రీన్‌కు ఎడమవైపున స్వైప్ చేస్తే ఇన్ కాగ్నిటో మోడ్ ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం కొంతమంది యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చింది. రానున్న రోజుల్లో అందరి యూజర్లకు కనిపించనుంది. ప్రస్తుతం కొంతమంది యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారు. మిగతా యూజర్లు ఈ ఫీచర్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.