WhatsApp Pay: వాట్సాప్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. వాట్సాప్ లేనిది ఏ స్మార్ట్‌ఫోన్ ఉండటం లేదు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. ఇక కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు రోజురోజుకు వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తోంది. ఇక పేమెంట్‌కు సంబంధించి ఫీచర్స్‌ను కూడా తీసుకువచ్చింది. డబ్బులను ఇతరులకు పంపుకోవడం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం వంటి ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
బ్యాంకు అకౌంట్ వివరాలను కూడా వాట్సాప్‌లో పొందుపర్చి లావాదేవీలు జరుపుకోవచ్చు. ఇక బ్యాంకుకు సంబంధించిన బ్యాలెన్స్‌ను సైతం చెక్ చేసుకోవచ్చు. అయితే బ్యాంకు ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసేందుకు రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి సెట్టింగ్స్ ద్వారా, రెండోది వేరే వాళ్లకి మనీని పంపుతున్నప్పుడు కూడా బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
సెట్టింగ్స్ ఆప్షన్ ద్వారా బ్యాలెన్స్ చెక్..
► ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి.
► అందులో కుడివైపు పైనున్న ఆప్షన్లలోకి వెళ్లాలి.
► అందులో పేమెంట్లపై క్లిక్ చేయాలి.
► పేమెంట్స్ మెథడ్స్ కిందనున్న బ్యాంకు అకౌంట్‌ను క్లిక్ చేయాలి.
► మీరు యాడ్ చేసుకున్న బ్యాంకు అకౌంట్లు అక్కడ కనిపిస్తాయి. లేకపోతే యాడ్ చేసుకోవచ్చు.
► ఆ అకౌంట్లలో ఏ బ్యాంకు ఖాతా వివరాలు కావాలో దానిపై క్లిక్ చేయాలి.
► ఆ తర్వాత వ్యూ అకౌంట్ బ్యాలెన్స్‌ను క్లిక్ చేయాలి.
► యూపీఐ పిన్‌ని నమోదు చేసి, మీ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు.
డబ్బులు పంపే సమయంలో బ్యాలెన్స్ చెక్..
► డబ్బులు పంపే సమయంలో కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
► పేమెంట్ నోటిఫికేషన్ స్క్రీన్ పై ప్రిఫర్డ్ పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి
► వ్యూ అకౌంట్ బ్యాలెన్స్‌ను క్లిక్ చేయాలి.
► మీ వాట్సాప్ అకౌంట్‌కు పలు బ్యాంకు అకౌంట్లు లింక్ అయి ఉంటే, ఆ బ్యాంకును సెలెక్ట్ చేసుకోవాలి.
► యూపీఐ పిన్‌ను నమోదు చేయాలి బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాట్సాప్ ద్వారా కూడా బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకునే సదుపాయం ఉంది.
ఇవి కూడా చదవండి: