Gold: ఇప్పుడు పాత బంగారం అమ్ముకుంటే లాభమేనా? నాణ్యతను నిర్ధారించడం ఎలా?

Gold: రన్ రాజా రన్ అంటోంది గోల్డ్. ఈ టైంలో ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని అమ్మి క్యాష్ చేసుకోడమెలా.. హాల్ మార్క్ లేని పాత బంగారాన్నిచ్చి కొత్త నగలు కొనుక్కోవడమెలా? మన బంగారాన్ని అమ్మితే తరుగు ఎంత తీస్తారు? మన బంగారానికి రేటెలా లెక్కకడతారు? ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందా? ఎక్స్ఛేంజ్‌ చేసుకోనిస్తారు కానీ, గోల్డ్ అమ్మితే క్యాష్ ఇస్తారా.. జ్యువెలరీ షాపుల్లో మన పసిడికి సరైన రేటొస్తుందా? ఈ అనుమానాలన్నీ తీరాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

Gold: ఇప్పుడు పాత బంగారం అమ్ముకుంటే లాభమేనా? నాణ్యతను నిర్ధారించడం ఎలా?
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు 200 రూపాయలు పెరిగి 10 గ్రాములకు 99,400 రూపాయలకు చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర బుధవారం చారిత్రాత్మకమైన రూ.1 లక్ష స్థాయి నుండి యు-టర్న్ తీసుకుని 10 గ్రాములకు రూ.2,400 తగ్గి రూ.99,200కి చేరుకుంది. అదే సమయంలో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.98,900కి చేరుకుంది. మునుపటి ముగింపు ధర 10 గ్రాములకు రూ.98,700గా ఉంది. ఇదిలా ఉండగా, గురువారం వెండి ధరలు కిలోకు రూ.700 పెరిగి రూ.99,900కి చేరుకున్నాయి. మునుపటి ముగింపు ధరలో వెండి కిలోకు రూ.99,200 వద్ద ముగిసింది.

Updated on: Apr 19, 2025 | 8:16 PM

Gold: ఎప్పుడో కొన్న బంగారం. మళ్లీ ఇంత రేటొస్తుందో లేదో. అవసరాలకు అమ్ముకుని సొమ్ముచేసుకుంటే బావుంటుందన్న ఆలోచన కొందరిది. ఎంతోకొంత అమ్మేసి భవిష్యత్తులో కాస్త తగ్గాక మళ్లీ కొనొచ్చనే దూరాలోచన ఇంకొందరిది. మార్కెట్‌లో లకారం పలుకుతోంది కొత్త బంగారం. మరి మన పాతబంగారాన్ని విలువ నిర్ధారించడమెలాగనేదే చాలామందికి ఉన్న సందేహం. పాత ఆభరణాలను రెండు దశల్లో పరిశీలిస్తారు. ముందుగా క్యారట్‌ మీటర్ మెషీన్‌పై స్కాన్ చేస్తారు. ఇది ఆ ఆభరణాల్లో ఎన్ని క్యారెట్ల బంగారం ఉందో చూపిస్తుంది.

రీసెంట్‌గా కొన్న బంగారానికి హాల్ మార్క్ ఉంటుంది. కానీ చాలామంది ఇళ్లల్లో పాత బంగారం ఉంటుంది. హాల్ మార్క్ లేనంత మాత్రాన దాని నాణ్యత తక్కువని కాదు. ఓల్డ్‌ గోల్డ్‌ నాణ్యత ఎంతుందో కొలిచే మిషినరీ అందుబాటులో ఉంది. ఒకప్పుడు బంగారం షాపుకెళ్తే ఈ నగ విలువ ఇంతేనని నోటి లెక్క చెప్పేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. క్యారట్ మీటర్‌తో బంగారం నాణ్యత తెలుసుకునే మిషన్ అందుబాటులో ఉంది. 60 సెకండ్లలోనే ఆ ఆభరణాలలో బంగారంతో పాటు.. అందులో ఇతర లోహాలు ఎంత శాతమున్నాయో తెలిసిపోతుంది.

BIS.. అంటే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌. హాల్‌మార్క్ బంగారంలో స్వచ్ఛతను గుర్తించేందుకు అధికారికంగా ఆమోదించిన ట్రేడ్‌మార్క్‌. హాల్ మార్క్ లేని బంగారాన్ని విక్రయించకూడదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశం జారీ చేసింది. మీ ఇంట్లో పాత బంగారానికి బీఐఎస్ హాల్‌మార్క్ వేయించుకోవాలంటే ముందుగా.. వెబ్ సైట్‌లో అధికారిక హాల్ మార్కింగ్ సెంటర్.. దగ్గర్లో ఎక్కడుందో చెక్‌ చేసుకోవాలి. నగల నాణ్యతను పరీక్షించాక అక్కడ హాల్ మార్క్ వేస్తారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Credit Card Bill: క్రెడిట్ కార్డ్ బిల్లు చివరి రోజున చెల్లించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందా?

BIS సెంటర్లలో హాల్‌మార్క్ ప్రక్రియ కోసం 35 నుంచి 200 వరకూ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మనం కొనే బంగారం నిజంగానే నాణ్యమైనదేనా అనే విషయంలో ఇప్పటికీ కొందరికి అనుమానాలున్నాయి. అయితే ఇలాంటి మోసాలను ముందే పసిగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆభరణాలపై ముందుగా బీఐఎస్‌ హాల్‌మార్క్‌ ఉందో లేదో చూసుకోవాలి. దీంతోపాటు ఆభరణంపై ఉండే నెంబర్లను బట్టి కూడా అది ఎంత స్వచ్ఛమైన బంగారమో నిర్ధారించుకోవచ్చు.

24 క్యారట్‌ బంగారం వందశాతం స్వచ్ఛమైంది. 22 క్యారట్‌ బంగారంలో 8.3 శాతం ఇతర లోహాలు కలుస్తాయి. 18 క్యారట్‌ ఆభరణాల్లో బంగారం 75 శాతమే ఉంటుంది. 14 క్యారట్‌కి 41.7 శాతం, 10 క్యారట్‌లో 58.3 శాతం ఇతర లోహాలు కలుస్తాయి. ఆభరణాలు కొన్నప్పుడు బిల్లు తీసుకోవడం, భద్రపరచటం చాలా ముఖ్యం. ఎందుకంటే అందులో దాని స్వచ్ఛత, గ్రాస్ వెయిట్, నెట్‌వెయిట్‌ క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఎక్స్ఛేంజ్‌ చేసుకోవాలా.. లేదంటే అమ్మి సొమ్ముచేసుకోవాలా అనేది కస్టమర్ల ఛాయిస్సే. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంతే.

ఇది కూడా చదవండి: Air Conditioner: 1.5 టన్నుల AC గంటకు ఎంత విద్యుత్తును వినియోగిస్తుంది? నెల బిల్లు ఎంత వస్తుంది?

ఇది కూడా చదవండి: Toll Tax Rules: మే 1 నుండి టోల్ ట్యాక్స్‌ నియమాలు మారుతాయా? ప్రభుత్వం కీలక అప్‌డేట్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి