Halwa Ceremony: బడ్జెట్‌కు ముందు హల్వా వేడుక ఎందుకు చేస్తారు? ఆ ఒక్క ఏడాది దీనిని ఎందుకు రద్దు చేశారు!

|

Jan 11, 2024 | 7:41 AM

'హల్వా వేడుక' దశాబ్దాలుగా బడ్జెట్‌తో ముడిపడి ఉన్న సంప్రదాయం. ఈ సంప్రదాయంలో బడ్జెట్‌ ముద్రణకు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని బడ్జెట్‌ మేకింగ్‌ అధికారుల మధ్య పెద్ద పాన్‌లో తయారు చేసిన 'హల్వా'ను పంచుతారు. ఈ సమయంలో ఆర్థిక మంత్రి స్వయంగా పాన్ నుండి హల్వా తీసి లాంఛనప్రాయంగా జరుపుకుంటారు.

Halwa Ceremony: బడ్జెట్‌కు ముందు హల్వా వేడుక ఎందుకు చేస్తారు? ఆ ఒక్క ఏడాది దీనిని ఎందుకు రద్దు చేశారు!
Halwa Ceremony
Follow us on

దేశంలో ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024న మాత్రమే ప్రవేశపెట్టనున్న తొలి మధ్యంతర బడ్జెట్ ఇది. అయితే బడ్జెట్‌కు ముందు ‘హల్వా వేడుక’ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ హల్వా వేడుకను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఒకసారి స్వయంగా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతకీ, ఈ ‘హల్వా వేడుక’ ఏంటి, నిర్మల ఎందుకు రద్దు చేసింది.

‘హల్వా వేడుక’ దశాబ్దాలుగా బడ్జెట్‌తో ముడిపడి ఉన్న సంప్రదాయం. ఈ సంప్రదాయంలో బడ్జెట్‌ ముద్రణకు ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని బడ్జెట్‌ మేకింగ్‌ అధికారుల మధ్య పెద్ద పాన్‌లో తయారు చేసిన ‘హల్వా’ను పంచుతారు. ఈ సమయంలో ఆర్థిక మంత్రి స్వయంగా పాన్ నుండి హల్వా తీసి లాంఛనప్రాయంగా జరుపుకుంటారు.

‘హల్వా వేడుక’ అంటే ఏమిటి?

‘హల్వా వేడుక’ బడ్జెట్‌ సిద్దమైన తర్వాత బడ్జెట్‌ ప్రతులను ప్రింటింగ్‌ ప్రారంభించే ముందు ఈ హాల్వా వేడుక జరుపుకొని అధికారికంగా ప్రారంభించింది. ఈ రోజు నుంచి ఆర్థిక శాఖలో పటిష్టమైన భద్రత ఉంటుంది. బడ్జెట్‌లో గోప్యత పాటించడమే ఇందుకు కారణం. బడ్జెట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లీకేజీ కాకుండా నిరోధించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు అలాగే న్యాయ మంత్రిత్వ శాఖ, CBDT, CBIC, PIB కొంతమంది అధికారులు నార్త్ బ్లాక్‌లో సుమారు 10 రోజుల పాటు ‘నిర్బంధంలో’ ఉండిపోతారు. ఈ సమయంలో సిబ్బంది ఎవ్వరు కూడా వాళ్ల ఇంటికి వెళ్లరు. కుటుంబ సభ్యులు, బంధువులతో ఎలాంటి సంబంధం ఉండదు.

సిబ్బంది తన కుటుంబంతో లేదా ఎవరితోనైనా అత్యవసర పరిస్థితుల్లో మాట్లాడవలసి వచ్చినప్పటికీ, ఫోన్‌ కాల్‌ ద్వారా మాట్లాడుతారు. ఆ ఫోన్‌ కాల్స్‌ కూడా ‘ఇంటెలిజెన్స్ బ్యూరో’ నిఘాలో ఉంటాయి.అధికారులందరూ ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత మాత్రమే ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం అయిన నార్త్ బ్లాక్ నుండి బయటకు వస్తారు. బడ్జెట్ ప్రింట్ చేయడానికి ఇక్కడ ప్రెస్ కూడా ఉంది.

నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్‌తో పాటు నిర్వహించాల్సిన ‘హల్వా వేడుక’ రద్దు చేశారు. ఇది 2022 బడ్జెట్‌కు ముందు జరిగింది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా, ఆ సంవత్సరం ఆర్థిక మంత్రిత్వ శాఖ ‘హల్వా వేడుక’ నిర్వహించకుండా అధికారులకు స్వీట్లు పంచారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..