Russia-Ukraine War Effect: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌.. 23 శాతం పెరిగిన వంట నూనె ధరలు

|

Apr 11, 2022 | 9:34 AM

Russia-Ukraine War Effect: రష్యా-ఉక్రెయిన్‌ యద్ధాలు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిత్యవసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా వంట నూనె ధరలు ఆకాశాన్నంటుతున్నాయి...

Russia-Ukraine War Effect: రష్యా-ఉక్రెయిన్‌ వార్‌ ఎఫెక్ట్‌.. 23 శాతం పెరిగిన వంట నూనె ధరలు
Follow us on

Russia-Ukraine War Effect: రష్యా-ఉక్రెయిన్‌ యద్ధాలు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిత్యవసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా వంట నూనె ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. యుద్ధాల కారణంగా ఉక్రెయిన్‌ (Ukraine) సరిహద్దులలో సముద్రం మీదుగా ప్రపంచ దేశాల నుంచి ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. ప్రపంచ ఆహార పదార్థాల ధరలు మార్చి నెలలో విపరీతంగా పెరిగిపోయాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (FAO) తెలిపింది. ఎఫ్‌ఏఓ ఆహార ధరల సూచీ మార్చిలో సగటున 159.3 పాయింట్లు నమోదు కాగా, ఫిబ్రవరి నెలతో పోలిస్తే 12.6శాతం పెరిగింది. ఇక ఫిబ్రవరిలో కంటే మార్చిలో ఎఫ్‌ఏఓ తృణధాన్యాల ధరల సూచి 17.1 శాతం పెరిగింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా గోధుమలు, ఇతర ధాన్యం ధరలు విపరీతంగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

గత మూడేళ్లలో ప్రపంచ గోధుమల, మొక్కజొన్న ఎగుమతుల్లో రష్యా-ఉక్రెయిన్‌లు వరుసగా 30శాతం, 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయతే యుద్ధాల కారణంగా ఆ రెండు దేశాల నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో మార్చిలో ప్రపంచ గోధుమల ధరలు 19.7శాతం పెరిగాయి. ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మొక్కజొన్న ధరలు నెలవారీగా 19.1 శాతం పెరుగుదల నమోదు కాగా, బార్లీ, జొన్నలతో పాటు మొక్కజొన్న ధర కూడా రికార్డు సృష్టిస్తున్నాయి. ఇక వంట నూనె ధర 23.2 శాతం పెరిగింది. సన్‌ప్లవర్‌ ఆయిల్‌ అధిక ధరకే విక్రయిస్తున్నారు. పొద్దుతిరుగుడు, విత్తన చమురు ధరల ఫలితంగా పామ్‌, సోయా, రాపీడ్స్‌ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ముడి సోయా చమురు ఎగుమతులు తగ్గిపోవడంతో దక్షిణ అమెరికాలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇవి కూడా చదవండి:

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న క్రేజ్‌.. అమ్మకాలలో ఈ కంపెనీ ఫస్ట్‌ ప్లేస్‌..!

Solar Panels: కొత్తతరం సోలార్ ప్యానెల్.. రాత్రిపూట కూడా విద్యుత్ ఉత్పత్తి..!