Telugu News Business Want withdraw from PF account, with these tips application is submitted from home, PF Withdrawal details in telugu
PF Withdrawal: పీఎఫ్ విత్‌డ్రా చేయాలా.? ఈ సింపుల్ టిప్స్‌తో ఇంటి నుంచే పని పూర్తి
భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా దేశంలో ప్రైవేట్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. అయితే రిటైర్‌మెంట్ తర్వాత వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఉద్యోగితో పాటు యజమాని సమాన వాటాతో ప్రత్యేక పొదుపు పథకం అందుబాటులో ఉంచింది. అయితే అనుకోని ఇబ్బంది వచ్చినప్పుడు పీఎఫ్ విత్‌డ్రాకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలంటే ఎలాంటి నిబంధనలు పాటించాలో? ఓసారి తెలుసుకుందాం.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలోని డబ్బు రిటైర్మెంట్ ఫండ్, పెన్షన్ కోసం జమ చేస్తారు. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఖాతా నుంచి పాక్షిక, పూర్తి మొత్తాన్ని విత్‌డ్రాలను చేయవచ్చు. పదవీ విరమణకు ముందు సాధారణంగా మీరు రెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉంటే మాత్రమే ఈపీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.అలాగే వైద్య అవసరాలు, సబ్‌స్క్రైబర్ లేదా పిల్లల వివాహం, గృహ రుణం చెల్లింపులకు, ఇల్లు కొనుగోలు చేయడానికి, ఇంటిని పునరుద్ధరించడం వంటి అవసరాలు ఉన్నప్పుడు పీఎఫ్‌ను పాక్షికంగా విత్‌డ్రా చేయవచ్చు. ఈ పాక్షిక ఉపసంహరణల్లో చాలా వరకు ఈపీఎఫ్ఓ సభ్యుడు తప్పనిసరిగా కనీసం ఐదు లేదా ఏడు సంవత్సరాలు ఈపీఎఫ్ సభ్యుడి గా ఉండాల్సి ఉంటుంది.
పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ ప్రక్రియ
యూఏఎన్ పోర్టల్‌కి వెళ్లి మీ యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.
ఓటీపీ ధ్రువీకరణ తర్వాత ప్రొఫైల్ పేజీ ఓపెన్ అవుతుంది. వెబ్ పేజీకు సంబంధించిన కుడి ఎగువ భాగంలో “ఆన్‌లైన్ సేవలు” ఎంపికను ఎంచుకోవాలి. అక్కడ క్లెయిమ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
ఈపీఎఫ్ఓ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేసి ద్వారా సభ్యుల వివరాలను ధ్రువీకరించాలి.
ఇప్పుడు క్లెయిమ్ చేసిన మొత్తం ఈపీఎఫ్ఓ ద్వారా ఈ బ్యాంక్ ఖాతాకు జమ అవుతుందని సర్టిఫికేట్ ఆఫ్ అండర్‌టేకింగ్ కనిపిస్తుంది. నిబంధనలు, షరతుల కోసం ‘అవును’ క్లిక్ చేయాలి.
ఆన్‌లైన్ సేవలను ఎంచుకుని అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
అనంతరం మీ చిరునామాను అందించిన స్కాన్ చేసిన చెక్కులు లేదా బ్యాంకు పాస్ బుక్ అప్‌లోడ్ లేదా ఫారమ్ 15 జీ వంటి కొన్ని పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాలి.
అనంతరం సబ్‌మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే క్లెయిమ్ అప్లికేషన్ విజయవంతం ప్రాసెస్ అవుతుంది.
అనంతరం వారం నుంచి 15 రోజుల్లో మీ సొమ్ము ఖాతాలో జమ అవుతుంది.