EPFO: మిస్ట్‌కాల్‌ ఇవ్వండి.. మీ పీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోండి..

|

Jun 07, 2022 | 5:48 PM

పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవాలనుకుంటున్నవారు ఒక్క మిస్డ్‌ కాల్‌ ఇస్తే మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలిసిపోతుంది. కానీ ముందు మీ యూఎన్‌ఏ నెంబర్‌ను ఈపీఎఫ్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి...

EPFO: మిస్ట్‌కాల్‌ ఇవ్వండి.. మీ పీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోండి..
Epfo
Follow us on

పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవాలనుకుంటున్నవారు ఒక్క మిస్డ్‌ కాల్‌ ఇస్తే మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలిసిపోతుంది. కానీ ముందు మీ యూఎన్‌ఏ నెంబర్‌ను ఈపీఎఫ్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ముందుగా మీరు ఈపీఎఫ్ఓ సైట్‌ వెళ్లాలి. అందులో సర్వీస్‌ మీద కర్సర్‌ పెట్టగానే ఎంప్లాయర్‌, ఎంప్లాయి అని వస్తుంది. ఎంప్లాయి మీద క్లిక్ చేయాలి. యూఎన్‌ఏ నెంబర్‌ సర్వీస్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అక్టివ్‌ UAN మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఒక ట్యాబ్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో మీ UAN నెంబర్‌, పేరు, ఆధార్‌ నెంబర్‌, మెయిల్‌ ఐడీ, ఫోన్‌ నెంబర్‌ నమోదు చేసి సడ్మిట్‌ చేయాలి. అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్‌ చేసిన తర్వాత మీ ఫోన్‌కు పాస్‌వర్డ్‌ సందేశం వస్తుంది. అప్పుడు బ్యాక్ వెళ్లి UAN నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్‌ చేసిన క్యాప్చా ఎంటర్ చేసి సడ్మిట్‌ కొట్టాలి. అప్పుడు మీ అకౌంట్‌ ఓపెన్‌ అవుతంది. మీరు పాస్‌వర్డ్‌ మార్చుకుంటే మార్చుకోవచ్చు.

ఈపీఎఫ్‌ఓతో రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ కనుగొనొచ్చు. మీరు మిస్డ్‌కాల్‌ ఇచ్చిన కాసేపటికే బ్యాలెన్స్‌ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో మీ మొబైల్‌కి వ‌స్తాయి. ఈ స‌ర్వీసుల‌ను పూర్తి ఉచితంగా పొంద‌వ‌చ్చు. స్మార్ట్ వినియోగ‌దారులే కాకుండా సాధార‌ణ మొబైల్ వినియోగ‌దారులు బ్యాలెన్స్ చెక్ చేసుకోవ‌చ్చు. యూఏఎన్‌ యాక్టివేట్‌ చేసుకున్న చందాదారులు ఈపీఎఫ్‌ ఖాతాకు జత చేసిన మొబైల్‌ నుంచి ‘EPFOHO UAN’ అని టైప్ చేసి 77382 99899 నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ పంపి బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు. ఉమంగ్‌ యాప్‌ ద్వారా కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఉమంగ్‌ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని అందులో పీఎఫ్ ఆప్షన్‌ ఎంచుకోవాలి. అప్పుడు మీ UAN నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. అప్పుడు లింక్‌ అయిన ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మీ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.