Volkswagen: కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు మామూలుగా లేవుగా..

|

Apr 25, 2024 | 5:17 PM

ప్రముఖ కార్ల కంపెనీ వోక్స్‌వ్యాగన్ నుంచి రెండు సరికొత్త కార్లు మార్కెట్ లోకి విడుదలయ్యాయి. టైగన్ జీటీ లైన్, టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్‌ పేరుతో వచ్చిన ఈ కార్లు స్పోర్టీ లుక్ తో ఎంతో ఆకట్టుకుంటున్నాయి. టైగన్ జీటీ లైన్ రూ. 14.08 లక్షలు (ఎక్స్ షోరూమ్), టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్ 18.53 లక్షలు (ఎక్స్ షోరూమ్)లలో అందుబాటులో ఉన్నాయి. ఈ మోడళ్లను 2024 మార్చిలో జరిగిన వోక్స్‌వ్యాగన్ వార్షిక బ్రాండ్ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించారు.

Volkswagen: కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు మామూలుగా లేవుగా..
Volkswagen Taigun Gt Plus
Follow us on

ప్రముఖ కార్ల కంపెనీ వోక్స్‌వ్యాగన్ నుంచి రెండు సరికొత్త కార్లు మార్కెట్ లోకి విడుదలయ్యాయి. టైగన్ జీటీ లైన్, టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్‌ పేరుతో వచ్చిన ఈ కార్లు స్పోర్టీ లుక్ తో ఎంతో ఆకట్టుకుంటున్నాయి. టైగన్ జీటీ లైన్ రూ. 14.08 లక్షలు (ఎక్స్ షోరూమ్), టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్ 18.53 లక్షలు (ఎక్స్ షోరూమ్)లలో అందుబాటులో ఉన్నాయి. ఈ మోడళ్లను 2024 మార్చిలో జరిగిన వోక్స్‌వ్యాగన్ వార్షిక బ్రాండ్ కాన్ఫరెన్స్‌లో ప్రదర్శించారు. ఇప్పుడు అధికారికంగా బ్రాండ్‌ల మోడల్ లైనప్‌లో చేరాయి.

మన దేశంలో డిమాండ్..

వోక్స్ వ్యాగన్ కంపెనీ కార్లకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. వాటిని కొనడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ తన పాపులర్ ఎస్ యూవీ టైగన్ ను రెండు విభిన్న వేరియంట్లలో మార్కెట్ లోకి ఆవిష్కరించింది. టైగన్ జీటీ లైన్, టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్ పేర్లతో ప్రీమియం స్పోర్టీ లుక్ లో రూపొందించింది. కారు బయట, లోపల అనేక కొత్త ఫీచర్లను ఏర్పాటు చేసింది.

సరికొత్త ఫీచర్లు..

ఈ సరికొత్త ఎస్ యూవీలు స్పోర్ట్ లైన్ నిర్మాణంలో భాగంగా ఉంటాయి. వాటి స్టాండర్డ్ వెర్షన్ తో పోల్చినప్పుడు చూడటానికి భిన్నం రూపొందించారు. కారు బయట డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంది. స్మోక్డ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కార్బన్ స్టీల్ గ్రే రూఫ్, రెడ్ ఫినిష్డ్ జీటీ బ్యాడ్జ్, రెడ్ బ్రేక్ కాలిపర్లు తదితర వాటిని అప్ డేట్ చేశారు. మోడల్ బ్లాక్ ఫినిషింగ్‌తో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

కారు లోపలి భాగంలో..

కార్ల లోపలి భాగంలో రెడ్ స్టిచింగ్‌తో బ్లాక్ లెథెరెట్ అప్హోల్స్టరీ, నలుపు డాష్‌బోర్డ్, బ్లాక్ హెడ్‌ లైనర్లు, అల్యూమినియం పెడెల్స్‌ ఉన్నాయి. బ్రాండ్ ముందు హెడ్‌రెస్ట్‌లపై జీడీ బ్యాడ్జ్‌ని కూడా ఏర్పాటు చేశారు. రెడ్ స్టిచింగ్ స్టీరింగ్ వీల్ ప్రత్యేకంగా నిలిచింది. కారులో సన్ వైజర్లు, బ్లాక్ గ్రాబ్ హ్యాండిల్స్ , రూఫ్ ల్యాంప్ హౌసింగ్ తదితర ఫీచర్ల ఉన్నాయి.

ఇతర ప్రత్యేకతలు..

టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్ కారు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 148 బీహెచ్ పీ, 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే టైగన్ జీటీ లైన్ కారులో 113 బీహెచ్ పీ, 178 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.0 లీటర్ TSI ఇంజిన్‌తో అమర్చారు. ఈ రెండు కార్ల ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తున్నాయి. ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది.

ధరల వివరాలు..

వోక్స్ వ్యాగన్ టైగన్ జీటీ లైన్ 1.0 ఎల్ టీఎస్ఐ ఎంటీ వెర్షన్ రూ.14,08,400, దానిలోని 1.0 ఎల్ టీఎస్ఐ ఏటీ వెర్షన్ రూ.15,63,400, అలాగే వోక్స్ వ్యాగన్ టైగన్ జీటీ ప్లస్ స్పోర్ట్ 1.5 ఎల్ టీఎస్ఐ ఈవీఎం ఎంటీ వెర్షన్ రూ.18,53,900, దానిలోని 1.5 ఎల్ టీఎస్ఐ ఈవీఎం డీఎస్జీ వెర్షన్ రూ.19,73,900కు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..