Vivo వచ్చే నెలలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సిద్ధమైంది. మే 4న దేశంలో Vivo T1 ప్రో, Vivo T1 44Wలను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ప్రారంభించిన Vivo T1 5Gలో కొత్త T1 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేసింది. ఇప్పుడు ఇదే సిరీస్‌లోని Vivo T1 ప్రో, Vivo T1 44Wలను విడుదల చేయనుంది. Vivo T1 Pro FHD+ AMOLED డిస్ప్లేతో రానుంది. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుందని తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 778G చిప్‌సెట్‌తో అందిస్తారని భావిస్తున్నారు.Vivo T1 ప్రో గరిష్టంగా 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజీని అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు 64MP మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
మరోవైపు, Vivo T1 44W 44W ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ ప్రారంభించిన Vivo T1 5G యొక్క టోన్డ్ డౌన్ వెర్షన్ అని చెబుతున్నారు. Vivo T1 44W Qualcomm Snapdragon 685 చిప్‌సెట్‌తో పని చేస్తుంది. ఇటీవల, Vivo తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను – Vivo X80, X80 Proని చైనాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 6.78-అంగుళాల 120Hz కర్వ్డ్ E5 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తు్న్నాయి. Vivo X80 Pro Qualcomm Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌తో ఇవి పని చేస్తాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌లు 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉన్నాయి.
Read Also.. LIC IPO: వచ్చే వారమే ఎల్‌ఐసీ ఐపీఓ.. పాలసీదారులకు రూ.60, ఉద్యోగులు రూ.45 సబ్సిడీ..