Vande Bharat: ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్ రైలుకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజున ప్రారంభం.. స్టాపులు ఇవే..

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రానికి తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు అయింది. నవంబర్ 1న ఈ రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ సిద్దమైంది. బెంగళూరు నుంచి ముంబై వరకు ఈ రైలు వెళ్లనుంది. ఏపీ మీదుగా ప్రయాణం ఉంటుంది.

Vande Bharat: ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్ రైలుకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజున ప్రారంభం.. స్టాపులు ఇవే..
Vande Bharat Sleeper

Updated on: Oct 21, 2026 | 8:53 PM

ఏపీలోని రైలు ప్రయాణికులకు పెద్ద శుభవార్త. ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు రానుంది. ఈ కొత్త రైలు పట్టాలెక్కేందుకు ముహూర్తం కూడా ఖరారు అయింది. నవంబర్ 1వ తేదీన లాంచనంగా ప్రారంభం కానుంది. బెంగళూరు- ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు బెంగళూరులో బయల్దేరనుండగా.. ఏపీ మీదుగా ముంబైకు వెళ్లనుంది. బెంగళూరు, ముంబై మధ్య వేగవంతమైన, సౌకర్యవంతమైన రాత్రిపూట ప్రయాణాన్ని ఈ రైలు అందించనుంది. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణికులు, పర్యాటకులు, విద్యార్థులు ఎక్కువగా పర్యటిస్తూ ఉంటారు. దీంతో వారికి ఇది గొప్ప ప్రయోజనం చేకూర్చనుంది. ఇప్పటికే ఈ రైలు నడిపేందుకు రైల్వేశాఖ ఆమోదం తెలపగా.. ఇప్పుడు నవంబర్ 1 నుంచి పట్టాలెక్కించేందుకు డేట్ ఫిక్స్ అయింది.

ఏపీలోని ఈ స్టేషన్లలో హాల్టింగ్

ఏపీలోని అనంతపురం, గుంతకల్ రైల్వే స్టేషన్లలో ఈ వందే భారత్ స్లీపర్ రైలు ఆగనుంది. మొత్తం 16 అధునాతన కోచ్‌లు ఇందులో ఉంటాయి. ఏసీ త్రీ టైర్, టూ టైర్, ఫస్ట్ ఏసీ క్లాసులు అందుబాటులో ఉంటాయి. ఈ రైలులో మొత్తం ఒకేసారి 823 మంది ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. రాత్రిపూట హాయిగా నిద్రపోతూ ప్రయాణించవచ్చు. ముంబైలో ప్రతీ రోజు రాత్రి 10:30 గంటలకు బయలుదేర్దనున్న ఈ రైలు.. మరుసటి రోజు మధ్యాహ్నం 2:50 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరిగు ప్రయాణంలో బెంగళూరు నుండి రాత్రి 10 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబైకి చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న రైళ్లల్లో జర్నీకి 22 గంటల సమయం పడుతుంది. వందే భారత్ స్లీపర్ రైలులో 16 గంటల్లోనే ప్రయాణించే సౌకర్యం అందుబాటులోకి రానుంది.

ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే..?

ఈ రైలు అనంతపురం, గుంతకల్లు రైల్వే స్టేషన్లలో ఆగనుండటంతో.. ఏపీలోని ప్రయాణికులకు కూడా వందే భారత్ స్లీపర్ సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు అయింది. దీని వల్ల రాయలసీమ ప్రాంతం నుండి బెంగళూరు, ముంబైతో పాటు మార్గం మధ్యలో ఉన్న ప్రధాన నగరాలకు ప్రయాణించే వారికి ఉపయోగపడనుంది. ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురం స్టేషన్లలో కూడా హాల్ట్ కల్పించాలని డిమాండ్లు ఉన్నప్పటికీ.. రైల్వేశాఖ నుంచి సానకూల నిర్ణయం రాలేదు. ఈ రైలు సోలాపూర్, పూణే, కళ్యాణ్, రాయచూర్, కలబుర్గి, అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో ఆగనుందని సమాచారం. వారానికి ఆరు రోజులు నడపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. దేశంలో తొలి వందే వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను హౌరా-గువహతి మధ్య ప్రారంభించారు. ఇప్పుడు ఇది రెండో ట్రైన్‌గా చెప్పవచ్చు. ఈ సారి దక్షిణాది రాష్ట్రాలకు కూడా వందే భారత్ స్లీపర్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us