Telugu News Business Vande Bharat Sleeper Train is so much more luxurious than Rajdhani Express
Vande Bharat Sleeper: వామ్మో ఇంత టెక్నాలజీనా..? వందే భారత్ స్లీపర్ రైలు ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే షాకవుతారు!
దేశంలో రైల్వే వ్యవస్థను మరింత మెరుగు పరుస్తోంది కేంద్ర ప్రభుత్వం. కొత్త కొత్త రైళ్లను అందుబాటులోకి తీసకువస్తోంది. వివిధ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు వందే భారత్, వందే స్లీపర్ వంటి అధిక వేగంతో వెళ్లే రైళ్లను ప్రవేశపెడుతోంది. అంతేకాదు ఇలాంటి రైళ్లలో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తోంది రైల్వే..
Follow us on
Vande Bharat Sleeper Train: వందేభారత స్లీపర్ రైలు నమూనా వెల్లడైంది. ఈ రైలు చాలా ప్రత్యేకం కానుంది. ఇది నవంబర్ 15 నాటికి ప్రారంభం కానుందని తెలుస్తోంది. అలాగే ఈ రైలు ఇతర పరీక్షలు, ట్రయల్స్ కోసం లక్నో RDSOకి పంపించనున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 78 వందేభారత రైళ్లు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా నడుస్తున్నాయి.
వందే భారత్ స్లీపర్ రైళ్లు రాజధాని ఎక్స్‌ప్రెస్ లాగా, ఇది పూర్తిగా ఎయిర్ కండిషన్. ఇందులో 16 స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. ఇది చాలా దూరం వెళ్లేందుకు రూపొందించారు. రూ.120 కోట్లతో దీన్ని తయారు చేశారు. డిజైన్‌ను ICF ఇంజనీర్లు తయారు చేశారు. అలాగే రేక్‌ను BEML తయారు చేసింది. ఈ రేక్‌లో 11 3AC, 4 2AC, ఒక ఫస్ట్-క్లాస్ కోచ్ ఉన్నాయి. ఈ రైలు మొత్తం సామర్థ్యం 823 మంది ప్రయాణికులు. ఈ రైలులో విలాసవంతమైన సదుపాయాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీని వాడారు. ఈ రైలును 800 నుంచి 1200 కిలోమీటర్ల మధ్య దూరాలను కవర్ చేసే మార్గాలలో నడపనుంది.
రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే ఈ రైలు ఎంత ప్రత్యేకం:
వేగం: వందే భారత్ స్లీపర్ రైలు 160 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. ఇది రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వేగంగా వెళ్తుంది. దీనిలో ప్రయాణించే ప్రయాణికులు తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకుంటారు.
నిద్రించేందుకు: వందే భారత్ స్లీపర్ రైళ్లలోని పడకలు మెరుగైన కుషనింగ్‌తో తయారు చేశారు. రాజధాని ఉంటే బెడ్స్‌కంటే ఇందులో ఎంతో మెరుగైనవిగా ఉంటాయి. ఇది కాకుండా, ఇందులో నిద్రించేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రతి బెడ్ వైపులా అదనపు కుషనింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
ఎగువ బెర్త్: ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తూ కొత్త వందే భారత్ స్లీపర్ రైలును రూపొందించినట్లు భారతీయ రైల్వే తెలిపింది. రాజధానితో పోలిస్తే పై బెర్త్‌కు చేరుకోవడానికి సులభమైన మెట్లు ఏర్పాటు చేశారు.
ఆటోమేటిక్ రైలు: వందే భారత్ స్లీపర్ ఆటోమేటిక్ రైలు. దీనికి రెండు చివర్లలో డ్రైవర్ క్యాబిన్ ఉంది. దీంతో రైలును లాగేందుకు ఇంజన్ అవసరం లేదు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌కి లోకోమోటివ్ అవసరం. ఈ డిజైన్ కారణంగా, చివరి స్టేషన్లలో టర్నరౌండ్ సమయం తగ్గుతుంది. ఇది సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఆటోమేటిక్ డోర్లు: వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణికుల కోసం ఆటోమేటిక్ ఎంట్రీ, ఎగ్జిట్ డోర్లు ఉంటాయి. ఇది డ్రైవర్ ద్వారా నియంత్రించడం జరుగుతుంది. అదనంగా కోచ్‌ల మధ్య ఆటోమేటిక్ ఇంటర్‌కనెక్టింగ్ డోర్లు కూడా ఉంటాయి. ఇది ప్రయాణీకుల సౌలభ్యం, భద్రతను మరింత మెరుగుపరుస్తుంది.
టాయిలెట్: వందే భారత్ స్లీపర్ రైలులో బయో-వాక్యూమ్ టాయిలెట్ సిస్టమ్ ఉంది. ఇది మాడ్యులర్ టచ్-ఫ్రీ ఫిట్టింగ్‌లను కలిగి ఉంది. మొదటి ఏసీ కోచ్‌లో ప్రయాణించే ప్రయాణికుల కోసం షవర్ క్యూబికల్ సౌకర్యం ఉంటుంది.
కుదుపు లేని ప్రయాణం: వందే భారత్ స్లీపర్ రైళ్లలో ప్రయాణికులు కుదుపు లేని, సాఫీగా ప్రయాణించే అనుభూతిని పొందుతారని రైల్వే అధికారులు తెలిపారు. రాజధాని రైళ్ల కంటే ఈ అనుభవం మెరుగ్గా ఉంటుందంటున్నారు.
ఇతర ఫీచర్లు:
ఎదురెదురుగా రైళ్లను ఢీకొనకుండా కవాచ్ టెక్నాలజీ
ప్యాసింజర్ నుండి డ్రైవర్ క్యాబిన్ వరకు ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్
GPS ఆధారిత LED డిస్‌ప్లే
ఛార్జింగ్ సాకెట్‌తో భారీ లగేజీ స్పేస్
బ్యాటరీలు పేలకుండా పేలుడు నిరోధక లిథియం-అయాన్ బ్యాటరీ
విజిలెన్స్ కంట్రోల్ పరికరం, ఈవెంట్ రికార్డర్
ఓవర్ హెడ్ లైన్ పవర్ ఫెయిల్యూర్ విషయంలో 3 గంటల ఎమర్జెన్సీ బ్యాకప్
#WATCH | Integral Coach Factory (ICF) in Chennai will be rolling out the Vande Bharat sleeper coaches soon pic.twitter.com/tcvYxKd4g5