Telugu News Business UPI services are mandatory for SBI credit card customers...They are mandatory for activation
SBI Credit Card UPI: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఖాతాదారులకు యూపీఐ సేవలు షురూ.. యాక్టివేషన్ చేయాలంటే అవి తప్పనిసరి
యూపీఐ చెల్లింపులు కేవలం బ్యాంకు ఖాతాలో ఉన్న నగదుతోనే జరుగుతాయి. క్రెడిట్ కార్డుల ద్వారా ఈ సేవలను పొందలేము. కానీ ఇటీవల ఎన్‌పీసీఐ రూపే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపులను చేసే అవకాశాన్ని కల్పించింది. అయితే అన్ని బ్యాంకుల కార్డులకు ఈ అవకాశాన్ని కల్పించినా బ్యాంకులు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి ఈ సేవలను కల్పిస్తున్నాయి.
భారతదేశంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఎన్‌పీసీఐ సహకారంతో వచ్చిన యూపీఐ సేవలు డిజిటల్ చెల్లింపుల్లో పారదర్శకతను తీసుకొచ్చాయి. అయితే యూపీఐ చెల్లింపులు కేవలం బ్యాంకు ఖాతాలో ఉన్న నగదుతోనే జరుగుతాయి. క్రెడిట్ కార్డుల ద్వారా ఈ సేవలను పొందలేము. కానీ ఇటీవల ఎన్‌పీసీఐ రూపే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపులను చేసే అవకాశాన్ని కల్పించింది. అయితే అన్ని బ్యాంకుల కార్డులకు ఈ అవకాశాన్ని కల్పించినా బ్యాంకులు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి ఈ సేవలను కల్పిస్తున్నాయి. రూపే క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి వివిధ ప్లాట్‌ఫారమ్‌లో యూపీఐ లావాదేవీలు చేయవచ్చు. ఎస్‌బీఐ కార్డ్ హోల్డర్లు తమ క్రెడిట్ కార్డ్‌ని థర్డ్-పార్టీ యూపీఐ అప్లికేషన్‌లతో సులభంగా లింక్ చేయవచ్చు.మీ ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డ్‌ని యూపీఐ ప్లాట్‌ఫారమ్‌కి ఎలా కనెక్ట్ చేయాలో ఓ సారి తెలుసుకుందాం.
యాక్టివేషన్ ఇలా
పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి మీ యాప్స్‌ను ముందుగా మీ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఇన్‌స్టాలేషన్ తర్వాత యాప్‌ని తెరిచి మీ ప్రత్యేక యూపీఐ ప్రొఫైల్‌ను ఏర్పాటు చేయాలి. మీ పేరు, వర్చువల్ చెల్లింపు చిరునామా (వీపీఏ), మీకు నచ్చిన పాస్‌వర్డ్ వంటి ముఖ్యమైన వివరాలను అందించాలి.
మీ ఎస్‌బీఐ రూపే క్రెడిట్ కార్డ్ నావిగేట్‌ను యాప్‌లోని ‘నా ఖాతా’ లేదా ‘బ్యాంక్ ఖాతా’ విభాగానికి లింక్ చేయండి. ఈ విభాగంలో మీరు మీ బ్యాంక్ ఖాతాను జోడించవచ్చు లేదా లింక్ చేయవచ్చు. అందించిన ఎంపికల నుండి ‘ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ని ఎంచుకోవాలి.
అక్కడ మీ పేరు, కార్డ్ నంబర్, గడువు తేదీ, సీవీవీతో సహా మీ క్రెడిట్ కార్డ్‌లోని చివరి ఆరు అంకెలను అందించాలి.
మీ కార్డ్ వివరాలను సమర్పించిన తర్వాత అప్లికేషన్ మీ బ్యాంక్ సహకారంతో ధ్రువీకరణ ప్రక్రియను ప్రారంభిస్తుంది.
యాక్టివేషన్ విజయవంతమైన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ (వన్-టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది. లింకింగ్ ప్రక్రియను ముగించడానికి ఈ ఓటీపీను నమోదు చేయాలి.
అంతే ఇక నుంచి మీరు లింక్ చేసిన యాప్ ద్వారా మీ క్రెడిట్ కార్డు నుంచి చెల్లింపులు చేసుకోవచ్చు. అయితే ఈ చెల్లింపులు కేవలం వ్యాపారుల ఖాతాలకే అని గుర్తుంచుకోవాలి.