
యూపీఐ చెల్లింపులు చేసేవారికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఇప్పటివరకు యూపీఐ ట్రాన్సాక్షన్లను చేయాలంటే పిన్ అవసరం పడేది. యూపీఐ యాప్స్ ద్వారా డబ్బులు బదిలీ చేయాలన్నా, బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా నాలుగు లేదా ఆరు అంకెల పిన్ ఎంటర్ చేయాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి తక్కువ మొత్తంలో చేసే లావాదేవీలకు యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా పేమెంట్స్ చేయవచ్చు.

మీ ఫోన్‌లో మీరు సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నిషన్ సెట్ చేసుకుంటారు. వాటి ఆధారంగా మీరు పేమెంట్స్ చేయవచ్చు. రూ.5 వేల వరకు చేసే లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. ఇప్పటివరకు రిసీవర్ బ్యాంక్ అకౌంట్, యూపీఐ నెంబర్ లేదా యూపీఐ ఐడీ సెలక్ట్ చేసుకున్నా అమౌంట్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పిన్ నెంబర్ నమోదు చేస్తే పేమెంట్ కంప్లీట్ అయ్యేది.

ఇక నుంచి పిన్ నెంబర్ స్థానంలో మీ ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నిషన్ ధృవీకరించాల్సి ఉంటుంది. అనంతరం పేమెంట్ పూర్తవుతుంది. దీని వల్ల ట్రాన్సాక్షన్లు వేగంగా పూర్తవ్వడంతో పాటు సురక్షితంగా చేసుకోవచ్చు. యూపీఐ పిన్ వేరేవారికి తెలిసే ఛాన్స్ ఉంటుంది. దీని వల్ల మోసాలు జరగవచ్చు. అయితే మీ బయోమెట్రిక్స్‌ను ట్యాపరింగ్ చేయడం కష్టం. దీని వల్ల డిజిటల్ లావాదేవీలకు భద్రత ఉంటుంది.

ఇప్పుడు అన్ని యూపీఐ యాప్స్, బ్యాంకింగ్ యూప్స్‌లో ఈ సౌకర్యం అందుబాటులో వచ్చింది. మీరు యూపీఐ యాప్స్‌లోకి వెళ్లి మీ బ్యాంక్ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకున్నాక బయోమెట్రిక్ వివరాల ఆధారంగా పేమెంట్స్ చేసే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. ప్రతీ బ్యాంక్ అకౌంట్‌కు ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవాలి. దీని వల్ల మీరు యూపీఐ విధానంలో పేమెంట్ చేసే సమయంలో మీ ఫింగర్ ప్రింట్ లేదా ముఖం చూపిస్తే సరిపోతుంది.

వ్యక్తిగత బదిలీలతో పాటు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయడం, ఆన్ లైన్ చెక్ అవుట్‌లతో పాటు అన్ని రకరాల యూపీఐ లావాదేవీలు చేయవచ్చు. రూ.5 వేల కంటే ఎక్కువ మొత్తంలో చెల్లించాలంటే యూపీఐ పిన్ అవసరమవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడించే బీమ్ యాప్‌తో పాటు బ్యాంకింగ్, ఇతర అన్ని యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.