UPI Payments: డిజిటల్‌ చెల్లింపులపై ఛార్జీ..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

భారత ప్రభుత్వం రూ.3000 కంటే ఎక్కువ విలువ గల UPI చెల్లింపులపై మర్చెంట్ డిస్కౌంట్ రేటు (MDR)ను తిరిగి ప్రవేశపెట్టడంపై పరిశీలిస్తోంది. బ్యాంకులు, చెల్లింపు సంస్థల ఖర్చులను భరించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. చిన్న విలువ గల లావాదేవీలకు మినహాయింపు ఉండే అవకాశం ఉంది.

UPI Payments: డిజిటల్‌ చెల్లింపులపై ఛార్జీ..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Upi

Updated on: Jun 11, 2025 | 7:46 PM

మౌలిక సదుపాయాలు, నిర్వహణ ఖర్చులను నిర్వహించడంలో బ్యాంకులు, చెల్లింపు సేవా కంపెనీలకు మద్దతు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా రూ.3,000 కంటే ఎక్కువ ఉన్న అన్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటును తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వ్యాపారి టర్నోవర్ కంటే లావాదేవీ విలువ ఆధారంగా మర్చంట్ డిస్కౌంట్ రేటును అనుమతించడానికి చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

అధిక విలువ కలిగిన డిజిటల్ లావాదేవీలను నిర్వహించడానికి అయ్యే ఖర్చు పెరుగుతుందని బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. “చిన్న-టికెట్ UPI చెల్లింపులు మినహాయింపుగానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ, పెద్ద లావాదేవీలకు త్వరలో వ్యాపారి రుసుము విధించవచ్చు. జనవరి 2020 నుండి అమలులో ఉన్న జీరో-MDR విధానాన్ని ఇది రద్దు చేయనట్లు సమాచారం.

రిటైల్ డిజిటల్ లావాదేవీలలో దాదాపు 80 శాతం UPI ద్వారానే జరుగుతుంది. కానీ జీరో మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధానం ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకు పరిమిత ప్రోత్సాహకాలను కలిగి ఉంది. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా UPI లావాదేవీల కోసం పెద్ద వ్యాపారులపై 0.3 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటును ప్రతిపాదించింది. ప్రస్తుతం, క్రెడిట్, డెబిట్ కార్డ్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు 0.9 శాతం నుండి 2 శాతం వరకు ఉంటుంది, ఇందులో RuPay మినహాయించి ఉంటుంది.

రూపే క్రెడిట్ కార్డులు ప్రస్తుతానికి మర్చంట్ డిస్కౌంట్ రేట్ పరిధిలోకి రాకుండా చేయాలని భావిస్తున్నారు. బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి వాటాదారులతో సంప్రదించిన తర్వాత, UPI చెల్లింపులపై ఛార్జీలు అంశంపై ఒకటి, రెండు నెలల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాక ఒక క్లారిటీ ఇచ్చింది. యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు విధించడం లేదంటూ స్పష్టం చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి