Underwater Train: నీటి అడుగున రైలు మార్గం.. ముంబై టూ దుబాయ్‌.. కేవలం రెండు గంటల్లోనే..!

Underwater Train: ముంబై - దుబాయ్ మధ్య ప్రయాణాన్ని కేవలం రెండు గంటల్లో పూర్తి చేయగలదు. ఈ రైలు ప్రయాణం విమాన ప్రయాణం కంటే వేగంగా ఉంటుంది. ఇందులో ప్రయాణీకులకు అనేక రకాల సౌకర్యాలు కూడా  కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నారు. దీనికి ఆమోదం లభిస్తే..

Underwater Train: నీటి అడుగున రైలు మార్గం.. ముంబై టూ దుబాయ్‌.. కేవలం రెండు గంటల్లోనే..!

Updated on: Apr 01, 2025 | 3:04 PM

ఇప్పుడు మీరు గురుగ్రామ్ కంటే వేగంగా దుబాయ్ చేరుకుంటారు. ఈ ప్లాన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. సముద్రం కింద రైలులో ప్రయాణించడం ఎంత ఉత్సాహంగా అనిపించినా ఇప్పుడు మీ కల నెరవేరబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య నీటి అడుగున రైలు సర్వీస్ త్వరలో ప్రారంభం కానుంది. ఇది రెండు దేశాల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఈ ప్రాజెక్టు 2030 నాటికి పూర్తవుతుంది.

భారతదేశం – దుబాయ్ మధ్య 1,200 మైళ్ల (సుమారు 2,000 కి.మీ) పొడవైన నీటి అడుగున రైలును నిర్మించాలనేది ప్రణాళిక. దీనివల్ల మీ ప్రయాణం సాహసంతో కూడి ఉంటుంది. మీరు ఈ రైలులో ప్రయాణించినప్పుడు, సముద్రం అడుగున ప్రపంచాన్ని చూడగలుగుతారు. కానీ క్లాస్ట్రోఫోబియా ఉన్నవారికి ఈ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది.

యుఎఇ ప్రణాళిక:

భారతదేశం – దుబాయ్ మధ్య రవాణాను మరింత మెరుగుపరచే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును యుఎఇ నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ కింద ప్రయాణీకులతో పాటు, ముడి చమురు, ఇతర వస్తువులను కూడా రైళ్ల ద్వారా వేగంగా రవాణా చేయవచ్చు. దీనివల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయి.

రైలు వేగం:

ఈ రైలు వేగం గంటకు 600 నుండి 1000 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఇది ముంబై – దుబాయ్ మధ్య ప్రయాణాన్ని కేవలం రెండు గంటల్లో పూర్తి చేయగలదు. ఈ రైలు ప్రయాణం విమాన ప్రయాణం కంటే వేగంగా ఉంటుంది. ఇందులో ప్రయాణీకులకు అనేక రకాల సౌకర్యాలు కూడా  కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నారు. దీనికి ఆమోదం లభిస్తే, అది 2030 నాటికి పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలో ఉందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Bank Holidays: ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు బందే.. ఏయే రోజుల్లో అంటే..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి