Telugu News Business Unbelievable benefits of registering your business in MSME, to know the government subsidies, MSME details in telugu
MSME: ఎంఎస్ఎంఈలో మీ వ్యాపార నమోదుతో నమ్మలేని లాభాలు.. ప్రభుత్వ రాయితీలు తెలిస్తే షాకవుతారు
వ్యాపారులతో పాటు ప్రజలకు కూడా ఈ చిన్న వ్యాపారాలు ప్రయోజనాలను అందిస్తున్నాియ. ఈ చిన్న వ్యాపారాలు ఆర్థికంగా ఎదగడానికి సహాయం చేయడానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సాయం చేస్తుంది. ఎవరైనా చిన్న వ్యాపారాన్ని కలిగి ఉంటే లేదా మైక్రో-ఎంటర్‌ప్రైజ్‌ని నడుపుతుంటే చౌక రుణాలతో సహా వివిధ ప్రయోజనాలను పొందడానికి తమ కంపెనీలను ఎంఎస్ఎంఈ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని అందరికీ తెలిసిందే. అనేక కొత్త వ్యాపారాలు ఇటీవల ప్రతిరోజూ తమ కార్యకలాపాలను ప్రారంభిస్తుననాయి. అయితే అన్ని వ్యాపారాలు స్థూల స్థాయిలో అమలు చేయబడవు. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు ఎక్కువ ప్రజాదరణ పొందాయి. వ్యాపారులతో పాటు ప్రజలకు కూడా ఈ చిన్న వ్యాపారాలు ప్రయోజనాలను అందిస్తున్నాియ. ఈ చిన్న వ్యాపారాలు ఆర్థికంగా ఎదగడానికి సహాయం చేయడానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సాయం చేస్తుంది. ఎవరైనా చిన్న వ్యాపారాన్ని కలిగి ఉంటే లేదా మైక్రో-ఎంటర్‌ప్రైజ్‌ని నడుపుతుంటే చౌక రుణాలతో సహా వివిధ ప్రయోజనాలను పొందడానికి తమ కంపెనీలను ఎంఎస్ఎంఈ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంఎస్ఎంఈకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అర్హత, ప్రయోజనాలను ఓ సారి తెలుసుకుందాం.
ఎంఎస్ఎంఈ అర్హతలు
పెట్టుబడి రూ. 1 కోటి మించకుండా, టర్నోవర్ రూ. 5 కోట్లు దాటని కంపెనీలను మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌గా పరిగణిస్తారు.
రూ.10 కోట్లకు మించని, టర్నోవర్ రూ.50 కోట్లకు మించని కంపెనీలు చిన్న పరిశ్రమలుగా పరిగణిస్తారు.
పెట్టుబడి రూ. 50 కోట్లకు మించకుండా, రూ. 250 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారంగా మధ్యస్థ సంస్థ వర్గీకరిస్తారు.
ఎంఎస్ఎంఈ నమోదు ఇలా
ఉదయం రిజిస్ట్రేషన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి
అక్కడ హోమ్‌పేజీలో ‘కొత్త రిజిస్ట్రేషన్’ ఎంచుకోవాలి. దానిపై క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫారమ్ కనిపిస్తుంది.
ఆధార్ నంబర్, వ్యాపారవేత్త పేరు, ఎంటర్ చేసి వాలిడేట్ అండ్ జెనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
ధ్రువీకరణ పేజీలో అవసరమైన పాన్ వివరాలను పూరించాలి.
అక్కడ ఉదయం రిజిస్ట్రేషన్ బాక్స్ కనిపిస్తుంది. అవసరమైన అన్ని వివరాలను పూరించాలి.
విజయవంతంగా నమోదు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్‌తో సహా ‘ధన్యవాదాలు’ సందేశాన్ని పొందుతారు.
కావాల్సిన పత్రాలు
ఆధార్ నంబర్
పాన్ నంబర్
వ్యాపార చిరునామా
బ్యాంకు ఖాతా సంఖ్య
ప్రాథమిక వ్యాపార కార్యకలాపాలు
ఎన్ఐసీ (2 అంకెల కోడ్)
పెట్టుబడి వివరాలు (ప్లాంట్ లేదా పరికరం వివరాలు)
టర్నోవర్ వివరాలు
భాగస్వామ్య దస్తావేజు
అమ్మకాలు, కొనుగోలు బిల్లుల కాపీలు
కొనుగోలు చేసిన యంత్రాల కోసం లైసెన్స్‌లు, బిల్లుల కాపీలు