TVS IQube: తగ్గేదేలే అంటున్న టీవీఎస్.. ఒకేసారి మూడు ఎలక్ట్రిక్ వేరియంట్లు లాంచ్.. పూర్తి వివరాలు ఇవి..

మన మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ ను అందిపుచ్చుకోడానికి అన్ని ద్విచక్ర వాహన తయారీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ జాబితాలో టీవీఎస్ కూడా చేరింది. ఒకేసారి మూడు వేరియంట్లను లాంచ్ చేసింది.

TVS IQube: తగ్గేదేలే అంటున్న టీవీఎస్.. ఒకేసారి మూడు ఎలక్ట్రిక్ వేరియంట్లు లాంచ్.. పూర్తి వివరాలు ఇవి..
TVS Iqube

Updated on: Mar 04, 2023 | 8:30 PM

మన మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ ను అందిపుచ్చుకోడానికి అన్ని ద్విచక్ర వాహన తయారీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ జాబితాలో టీవీఎస్ కూడా చేరింది. టీవీఎస్ ఐ క్యూబ్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని ఆ కంపెనీ ఆవిష్కరించింది. ఇటీవల సికింద్రాబాద్ లోని కిరణ్ టీవీఎస్ డీలర్ షిప్ లో దీనిని విడుదల చేసింది.
టీవీఎస్ ఐక్యూబ్‌, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ పేరిట ఐదు రంగులతో లాంచ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లను అందులో పొందుప‌ర్చింది. ఆ వివరాలు ఏంటో ఓ సారి చూద్దాం..

పూర్తి కాలుష్య రహితంగా..

తమ హైఎండ్ ఈవీలు కాలుష్య రహితంగా ఉంటాయని టీవీఎస ప్రకటించింది. అంతేకా శబ్దం లేని రైడ్, పూర్తి డిజిటల్ మీటర్, హెచ్ఎంఐ కంట్రోలర్ తో కూడిన సదుపాయాలు ఉంటాయని పేర్కొంది. దీని రన్నింగ్ కాస్ట్ 15,000 కిలోమీటర్లకు రూ. 7000గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ ఆన్ రోడ్ ధర రూ. 1,15,000 నుంచి ప్రారంభమవుతోంది. ఈ స్కూటర్లలో 3.4 kWh సామర్థ్యంతో కూడిన రెండు లిథియం బ్యాటరీలు ఉంటాయి. 1.5కేవీ ప్ల‌గ్ అండ్ ప్లే చార్జింగ్ ఫెసిలిటీ ఉంది. దీనిలోని బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 140 కిమీలు వెళ్ల‌వ‌చ్చ‌ని కంపెనీ చెబుతోంది. అలాగే 78 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఇది ప్రయాణించగలుగుతుంది. ఈ వాహనం ఇటీవలే ఆటోకార్స్ నుంచి గ్రీన్ బైక్ ఆఫ్ ఇండియాగా అవార్డు పొందినట్లు టీవీఎస్ ఏరియా మేనేజర్ విశాల్ విక్రమ్ సింగ్ పేర్కొన్నారు

ఫీచర్లు ఇవి..

ఈ స్కూట‌ర్‌లో 7 అంగుళాల ట‌చ్ స్క్రీన్ బేస్డ్ యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్‌, మ్యూజిక్ ప్లేయ‌ర్ కంట్రోల్‌, వాయిస్ అసిస్ట్‌, వెహికిల్ హెల్త్ అండ్ సెక్యూరిటీ, ఓటీఏ అప్‌డేట్స్‌, ఫాస్ట్ చార్జింగ్, టీవీఎస్ ఐక్యూబ్ అలెక్సా స్కిల్‌సెట్, బ్లూటూత్ క‌నెక్టివిటీ ఆప్షన్స్‌, క్లౌడ్ క‌నెక్టివిటీ ఆప్ష‌న్స్‌ వంటి ఆధునిక స‌దుపాయాలు ఉన్నాయి. ఇత‌ర ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కన్నా ఎక్కువ స్టోరేజ్ ఫెసిలిటీ(32 లీట‌ర్‌) ఇందులో ఉంద‌ని తెలిపింది. రెండు హెల్మెట్ల‌ను ఇందులో సుల‌భంగా అమ‌ర్చవ‌చ్చ‌ని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..