TV9 Network ‘లీడర్స్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కాంక్లేవ్ 2024’ ప్రారంభం.. ఈ విషయాలపైనే కీలక చర్చ..

Leaders of Road Transport Conclave: రోడ్ సేఫ్టీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, సస్టైనబిలిటీ అవార్డుల నాలుగో ఎడిషన్.. TV9 నెట్‌వర్క్ “లీడర్స్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కాంక్లేవ్” మంగళవారం (జనవరి 23, 2024) ముంబైలో ప్రారంభమైంది. ఈ కాన్‌క్లేవ్‌ సందర్భంగా భారతదేశ రహదారి రవాణా రోజురోజుకు విస్తరిస్తున్నందున రవాణా, లాజిస్టిక్స్ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై లోతైన చర్చలు జరిగాయి.

TV9 Network లీడర్స్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కాంక్లేవ్ 2024 ప్రారంభం.. ఈ విషయాలపైనే కీలక చర్చ..
TV9 Network’s Leaders of Road Transport Conclave 2024

Updated on: Jan 23, 2024 | 5:00 PM

Leaders of Road Transport Conclave: రోడ్ సేఫ్టీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, సస్టైనబిలిటీ అవార్డుల నాలుగో ఎడిషన్.. TV9 నెట్‌వర్క్ “లీడర్స్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కాంక్లేవ్” మంగళవారం (జనవరి 23, 2024) ముంబైలో ప్రారంభమైంది. ఈ కాన్‌క్లేవ్‌ సందర్భంగా భారతదేశ రహదారి రవాణా రోజురోజుకు విస్తరిస్తున్నందున రవాణా, లాజిస్టిక్స్ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. భారతదేశం రెండవ అతిపెద్ద రహదారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నందున, లాజిస్టిక్స్ రంగంలో పురోగతి, అది ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చ నిర్వహించారు. అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌లను కలిగి ఉన్న దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా.. భారత్‌ రెండో స్థానంలో ఉంది.. కావున రోడ్ సేఫ్టీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, సస్టైనబిలిటీ గురించి పలువురు ప్రముఖులు పలు విషయాలను ప్రస్తావించి.. చర్చించారు. ముంబైలోని తాజ్ శాంతాక్రూజ్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో అన్ని రంగాలకు చెందిన పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు.

నాలుగో ఎడిషన్‌లో, TV9 నెట్‌వర్క్ ట్రాన్స్‌పోర్టర్‌లను గత సంవత్సరంలో సాధించిన వారి విజయాలను గుర్తించింది. ‘లీడర్స్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కాంక్లేవ్’ స్మార్ట్ మొబిలిటీ ఎకోసిస్టమ్‌ను సాధించడంలో కీలకమైన అంశాలను హైలైట్ చేసింది. అంటే రహదారి భద్రత, రవాణా, సాంకేతికత, ఆవిష్కరణ, స్థిరత్వం.. గురించి ప్రధానంగా చర్చించారు.

ఆర్‌ఎస్‌ ఇండియా మార్కెట్‌ డైరెక్ట్‌ సేల్స్‌ హెడ్‌ రజనీష్‌ కోచ్‌గావే స్వాగతోపన్యాసం చేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహారాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌ వివేక్‌ భీమన్‌వర్‌ కీలకోపన్యాసం చేశారు. అశోక్ షా (V-ట్రాన్స్ యజమాని), అశోక్ గోయెల్ (BLR లాజిస్టిక్స్ యజమాని), చిరాగ్ కతీరా (శ్రీ నాసిక్ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ కో. ప్రైవేట్ లిమిటెడ్ యజమాని), బాల్ మల్కిత్ సింగ్ (బాల్ రోడ్‌వేస్ యజమాని -చైర్మన్, కోర్ కమిటీ, మాజీ అధ్యక్షుడు, ఆల్ ఇండియా మోటో ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ & మహీందర్ ఆర్య యజమాని, SSRL), శివజీత్ జైస్వాల్ (డైరెక్టర్ ఆఫ్ హైవే ఆన్ వీల్స్), సుయాన్ష్ గుప్తా (బెస్ట్ రోడ్స్ డైరెక్టర్), అశ్విన్ అగర్వాల్ (భాగస్వామి – సేఫ్ & సెక్యూర్ లాజిస్టిక్స్ PVT LTD).. ప్రసంగించారు.

కాగా, కాంక్లేవ్‌ మునుపటి ఎడిషన్లు ఢిల్లీ, బెంగళూరులో జరిగాయి. ప్రభుత్వ విధానాలు, స్థూల ఆర్థిక పరిస్థితులు, రవాణా ఎదుర్కొంటున్న సవాళ్లపై విస్తృతమైన చర్చలు జరిగాయి.


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి