Multibagger Returns: మల్టీ బ్యాగర్ షేర్లను కనుక్కోవటం కొంచెం కష్టమైన పని అని చెప్పుకోవాలి. వేల సంఖ్యలో ఉండే షేర్ల నుంచి మంచి రాబడిని ఇచ్చే షేర్లను కనుక్కోవటం ద్వారా పెట్టుబడిదారులు లాభాలను పొందవచ్చు. అనతి కాలంలోనే(Short Span) ఎక్కువ రిటర్న్స్ ఇచ్చి ఇన్వెస్టర్లను(Investors) లక్షాధికారులు చేస్తుంటాయి. అలాంటి కోవకు చెందినదే TV-18 బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్ షేర్ కూడా. గత ఏడాది కాలంలో ఈ షేర్ తన ఇన్వెస్టర్లకు అద్భుతమైన రిటర్నులను అందజేసి మల్టిబ్యాగర్‌గా నిలిచింది. ఏప్రిల్ 13, 2021న రూ.27.20గా ఉన్న కంపెనీ షేర్ రేటు.. ఏప్రిల్ 12, 2022కు రూ.75.95కు పెరిగింది. దీంతో కంపెనీ ఇన్వెస్టర్లకు సంవత్సర కాలంలో 179 శాతం రిటర్నులను పొందారు. S&P BSE 500 ఇండెక్స్ అందించిన రిటర్నుల కంటే ఈ షేరు అందించిన రిటర్నులు 7 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏడాది క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ రూ.2.79 లక్షలకు పెరిగింది. అంటే లక్షలు.. లక్షా ఎనభైవేల వరకూ లాభాలను అందించింది.
TV-18 బ్రాడ్‌కాస్ట్ ఇండియా అనేది నెట్‌వర్క్- 18 గ్రూప్‌లో ఒక భాగం. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ మీడియా ట్రస్ట్ దీనికి ఓనర్‌గా ఉంది. వయాకామ్ 18 ఇంక్‌తో కలిసి TV-18 బ్రాడ్‌కాస్ట్ సంస్థ.. వయాకామ్18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక జాయింట్ వెంచర్‌ను కూడా ఆపరేట్ చేస్తోంది. దీనిలో TV-18కు 51 శాతం వాటా ఉండగా.. 49 శాతం వాటా వయాకామ్ సంస్థకు ఉంది. ప్రముఖ ఎంటర్‌టైన్ దిగ్గజం Viacom18 తన నెట్‌వర్క్ విభాగంలో స్పోర్ట్స్ కోసం Sports18 ఛానల్‌ను శుక్రవారం ప్రారంభించింది. ఈ ఛానల్ ద్వారా దేశంలోని ప్రేక్షకుల కోసం అత్యుత్తమ స్పోర్ట్స్ కంటెంట్‌ను అందిస్తామని, అంతర్జాతీయంగా ఎంతో ఆదరణ కలిగిన ఫిఫా వరల్డ్‌కప్ 2022, ఎన్‌బీఏ, లలిగా, అబుదాబి T-10 సహా అనేక కార్యక్రమాలను Sports18 ద్వారా వీక్షించవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఛానల్‌లో ఫుట్‌బల్, బాస్కెట్‌బాల్, టెన్నిస్, క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటి అంతర్జాతీయ క్రీడలు, క్రీడా వార్తలు, ఇంకా అనేక క్రీడా సంబంధిత కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఎన్‌బీఏతో మల్టి ఇయర్ పార్టనర్‌షిప్ ఏర్పరుచుకుని, తన స్పోర్ట్స్ పోర్టుఫోలియోలో ఇటీవలే బాస్కెట్ బాల్‌ను కూడా ఈ జాయింట్ వెంచర్ యాడ్ చేసుకుంది. ఈ స్టాక్ ఏడాది కాలంలో 52 వారాల గరిష్ఠమైన రూ.82.55 మార్కును, 52 వారాల కనిష్ఠమైన రూ.26.50 మార్కును తాకింది.
ఇవీ చదవండి..
Credit Card: ఆ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. రూ.35 వేలు డిస్కౌంట్ పొందండిలా..!
Rising Prices: కూరగాయలూ కొనలేమంటున్న సామాన్యులు.. సర్వేలో షాకింగ్ విషయాలు.. బాదుడు ఆగదా..?