వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు.. దేశంలో రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్‌ ధరలు

|

Feb 09, 2021 | 2:24 PM

Petrol rates : గత రెండు రోజులుగా ఎలాంటి మార్పులేని ధరలు.. స్వల్ప విరామం తరువాత తాజాగా రికార్డు స్థాయికి చేరాయి.

వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు..  దేశంలో రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్‌ ధరలు
Follow us on

Petrol, diesel prices : దేశంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. గతకొంతకాలంగా చుక్కలు చూపిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గత రెండు రోజులుగా ఎలాంటి మార్పులేని ధరలు.. స్వల్ప విరామం తరువాత తాజాగా రికార్డు స్థాయికి చేరాయి. మంగళవారం మరోసారి పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు చొప్పున పెంచుతూ చమురుకంపెనీలు నిర్ణయించాయి. దీంతో గత నెల రోజులలో మునుపెన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయి. జనవరి 6 నుంచి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.3కు పైగా పెరగడం గమనార‍్హం.

తాజా పెంపుతో దేశ రాజధానిలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ. 87.30 ఉండగా, డీజిల్ ధర రూ .77.48గా నమోదు అయ్యింది. అటు ముంబైలో లీటరుకు రూ. 93.83 ఉంటే, డీజిల్ ధర రూ. 84.36కు చేరుకుంది. అటు చెన్నైలో పెట్రోల్ ధర రూ .89.70 కాగా, డీజిల్ రూ. 82.66గా ఉంది. అటు కోల్‌కతాలో పెట్రోల్ రూ.88.63 పలికితే, డీజిల్ ధర రూ.81.06కు చేరుకుంది. ఇక, బెంగళూరులో పెట్రోల్ రూ.90.22 ఉండగా, డీజిల్ రూ.82.13కు చేరుకుంది. ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలో పెట్రోల్ రూ.90.78 ఉండగా, డీజిల్ రూ. 84.52కు చేరుకుంది. అటు ఏపీలోని అమరావతిలో పెట్రోల్ రూ. 93.44, డీజిల్ రూ. 86.68 పలికింది.

మరోవైపు, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గరిష్టానికి చేరాయి. మంగళవారం 13 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్‌ బ్యారెల్ ధర 60 డాలర్లు దాటేసింది. సోమవారం 2 శాతం పెరిగి ఏడాదిలోనే అత్యధిక స్థాయిని చేరుకుంది.

Read Also..  జమ్మూ-శ్రీనగర్‌లో భారీగా విరిగిపడ్డ కొండచరియలు.. ఐదు రోజులుగా తెరుచుకోని జాతీయ రహదారి.. ప్రయాణికుల ఇక్కట్లు..!