Petrol, Diesel Price (07-02-2021): పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ … దేశంలో ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధరలు ఇలా..

|

Feb 07, 2021 | 6:25 AM

Today Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎప్పుడో ఒకసారి తగ్గించినా..

Petrol, Diesel Price (07-02-2021): పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ... దేశంలో ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధరలు ఇలా..
Follow us on

Today Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారుతోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎప్పుడో ఒకసారి తగ్గించినా.. పెరగడం మాత్రం రోజూ ఉంటుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో వాహనదారుల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా.. ధరలు పెరగడం మాత్రం ఆగడం లేదు.

ఇక ఫిబ్రవరి 7న దేశ వ్యాప్తంగా లీటర్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌కు రూ.86.95గా ఉండగా, డీజిల్ ధర లీటర్‌కు రూ.77.13కు చేరింది.

హైదరాబాద్‌లో లీటర్‌ ధర రూ.90.42, డీజిల్‌ రూ.84.14గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ రూ.83.99గా నమోదైంది. చెన్నైలో పెట్రోల్ రూ.89.39, డీజిల్ రూ.83.99 గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ.89.85 ఉండగా, డీజిల్ రూ.81.76గా ఉంది. అలాగే కోల్‌కతాలో పెట్రోల్ రూ.89.30, డీజిల్ రూ.80.71 ఉంది. రోజురోజుకు పెరుగుతున్న ధరల నేపథ్యంలో సామాన్యుడి జేబుకు చిల్లులు పడేలా ఉన్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచేది లేదని చెప్పినా.. ప్రతి రోజు స్వల్పంగా పెరుగుతుతూనే ఉన్నాయి.

Also Read: Maruti suzuki: కారు కొనాలనుకుంటున్నవారికి గుడ్‌న్యూస్.. అందుబాటు ధరల్లో మారుతి సుజుకి కార్లు.. వివరాలివే..