Gold And Silver Price: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. గత వారం రోజుల్లో గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి. అమెరికా ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది దీంతో గోల్డ్ రేట్స్ భారీగా పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా రానున్న రోజులు శుభ ముహుర్తాలు ఉన్న కారణంగా కూడా బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
ఇది కూడా గోల్డ్ రేట్స్ పెరగడానికి కారణంగా చెబుతున్నారు. తాజాగా శుక్రవారం గోల్డ్ ధర భారీగా పెరిగింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగారల్లో బంగారం ధర పెరిగింది. ఇక వెండి కూడా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. వెండి ధరలోనూ పెరుగుదల కనిపించింది. మరి శుక్రవారం దేశంలోని అన్ని ప్రధాన నగారాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 47,250 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,550 గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 47,100 కాగా, 24 క్యారెట్ల ధర రూ.51,380 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 47,670 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 52,000 గా నమోదైంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 47,150 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 51,440 వద్ద కొనసాగుతోంది.
* హైదారాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 47,100 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 51,380 గా ఉంది.
* విజయవాడలో 22 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 47,100 గా ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 51,380 గా నమోదైంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 47,100 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 51,380 వద్ద కొనసాగుతోంది.
శుక్రవారం ఢిల్లీలో కిలో వెండిపై రూ. 1900 పెరిగి.. రూ. 56,500, ముంబయిలో రూ. 56,500, హైదరాబాద్‌లో రూ. 62,200, విజయవాడలో రూ. 61,200, విశాఖపట్నంలో రూ. 61,200 వద్ద కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో వెండి ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..