వృద్ధాప్యంలో సుఖమయ జీవనం కావాలంటే ముందు నుంచి సరైన ఆర్థిక ప్రణాళిక అవసరం. లేకుంటే ఆ వయసులో ఇబ్బందులు తప్పవు. సాధారణంగా రిటైర్ మెంట్ సమయానికి వచ్చేసరికి ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అప్పటి ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. మరీ ఆసమయంలో ఎవరిమీద ఆధారపడకుండా.. మీ ఖర్చులకు మీరే సంపాదించుకోవాలంటే ముందు నుంచి రిటైర్ మెంట్ ప్లానింగ్ అవసరం. ఏవైనా మంచి పథకాలలో పెట్టుబడి పెడుతూ రిటైర్ మెంట్ సమయానికి అధిక ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. అందుకు బాగా ఉపకరిస్తాయి. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లు (పీఓఎస్ఎస్). ఇవి వినియోగదారులకు సురక్షితమైనవిగా ఉంటాయి. ప్రభుత్వ మద్దతు కూడా ఉండటంతో మీ డబ్బుకు భరోసా ఉంటుంది. అలాగే మంచి వడ్డీతో అధిక రాబడినిస్తాయి. అందుకే పదవీవిరమణ తర్వాత గురించి మీరు ఆందోళన చెందుతుంటే మీకు ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్లు చాలా మంచి ఆప్షన్ గా నిలుస్తాయి.
మీరు పోస్ట్ ఆఫీస్ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా తగిన ఆదాయాన్ని పొందవచ్చు. అవసరం అయితే మీ జీవిత భాగస్వామితో సంయుక్తంగా ఖాతాను తెరవవచ్చు. అటువంటి పథకాలలో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (పీఓఎంఐఎస్) ఒకటి. ఇది పదవీ విరమణ తర్వాత మీకు నగదును అందిస్తుంది.
ఈ పథకం కింద, మీరు ఒకసారి పెట్టుబడి పెట్టి.. నెలవారీ చెల్లింపును ఆదాయంగా పొందుతారు. ఇది కేవలం డిపాజిట్ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీపై ఆధారపడి ఉంటుంది. మీరు వ్యక్తిగతంగా రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా నెలకు రూ.9,250 చెల్లింపును పొందవచ్చు. అయితే, మీరు మీ జీవిత భాగస్వామితో ఉమ్మడి ఖాతాను తెరిస్తే, నెలవారీ అదే మొత్తాన్ని పొందడానికి మీరు మొత్తం రూ.15 లక్షలను పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం, పథకం వార్షిక వడ్డీ రేటు 7.4 శాతం అందిస్తుంది. మొదటి పెట్టుబడి పెట్టిన ఒక నెల తర్వాత చెల్లింపును పొందవచ్చు.
మీరు మీ జీవిత భాగస్వామితో ఉమ్మడి ఖాతా కలిగి ఉండి, సంవత్సరానికి రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే, వడ్డీ మొత్తం రూ.1,11,000 అవుతుంది. మీరు నెలకు రూ. 9,250 చెల్లింపును అందుకుంటారు. ఇది కేవలం సంపాదించిన వడ్డీపై ఆధారపడి ఉంటుంది. అదనంగా, మీ డబ్బు పోస్ట్ ఆఫీస్ వద్ద సురక్షితంగా ఉంటుంది. మెచ్యూరిటీ వ్యవధి తర్వాత, మీరు ప్రిన్సిపల్ మొత్తాన్ని కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు.
పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు. మీరు మీ ప్రాధాన్యతను బట్టి పథకాన్ని 5 నుంచి 15 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. అంతేకాకుండా, మీరు లబ్ధిదారులుగా ముగ్గురు వ్యక్తులతో ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. డబ్బు వారి మధ్య సమానంగా పంపిణీ అవుతుంది.
మీకు ప్రీమెచ్యూర్ క్లోజర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఖాతా తెరిచిన ఒక సంవత్సరం తర్వాత మీరు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, మీరు ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మధ్య డబ్బును విత్‌డ్రా చేస్తే, మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై 2 శాతం పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది. మూడు సంవత్సరాల తర్వాత, మీరు 1 శాతం పెనాల్టీ పడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..