Credit card: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా.? ఏప్రిల్‌ 1 నుంచి ఈ రూల్స్‌ మారుతున్నాయి

ఒకప్పుడు క్రెడిట్‌ వినియోగం తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగం భారీగా పెరిగింది. దేశంలో రోజురోజుకీ క్రెడిట్‌ కార్డు యూజర్ల సంఖ్య పెరుగుతోంది. బ్యాంకుల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో క్రెడిట్ కార్డులను ఎక్కువగా అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌ ప్రారంభమవుతుంది. దీంతో ఆర్థికపరమైన కొన్ని విషయాల్లో...

Credit card: మీరు క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా.? ఏప్రిల్‌ 1 నుంచి ఈ రూల్స్‌ మారుతున్నాయి
Credit Card

Updated on: Mar 31, 2024 | 3:16 PM

ఒకప్పుడు క్రెడిట్‌ వినియోగం తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగం భారీగా పెరిగింది. దేశంలో రోజురోజుకీ క్రెడిట్‌ కార్డు యూజర్ల సంఖ్య పెరుగుతోంది. బ్యాంకుల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో క్రెడిట్ కార్డులను ఎక్కువగా అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌ ప్రారంభమవుతుంది. దీంతో ఆర్థికపరమైన కొన్ని విషయాల్లో మార్పులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డులకు సంబంధించిన కొన్ని రూల్స్ మారనున్నాయి. ఇంతకీ ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* క్రెడిట్ కార్డు రివార్డ్‌ పాయింట్ల విషయంలో ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ మార్పు చేసింది. ఇప్పటి వరకు రెంట్‌ చెల్లింపులపై ఎస్‌బీఐ రివార్డ్‌ పాయింట్లను అందిస్తుండగా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఆ తరహా రివార్డులను ఆపేయనున్నారు.

* ఇక ఐసీఐసీ బ్యాంక్‌ కూడా క్రెడిట్‌ కార్డ్‌ విషయంలో కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో నిబంధనల్ని సవరించింది. ఇకపై ఈ సదుపాయం పొందాలంటే.. గడిచిన మూడు నెలలో రూ. 35,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

* యస్‌ బ్యాంక్‌ సైతం లాంజ్‌ యాక్సెస్‌ విషయంలో కొన్ని నిబంధనలను మార్చింది. లాంజ్‌ యాక్సెస్‌ పొందాలనుకుంటే అంతకు ముందు త్రైమాసికంలో కార్డు ద్వారా కనీసం రూ. 10,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

* యాక్సిస్‌ బ్యాంక్‌కు చెందిన మాగ్నస్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రివార్డ్‌ పాయింట్లు, లాంజ్‌ యాక్సెస్‌తో పాటు వార్షిక ఛార్జీల్లోనూ కీలక మార్పులను చేసింది. బీమా, గోల్డ్‌, ఫ్యూయల్‌ కోసం క్రెడిట్‌ కార్డు ద్వారా జరిపే చెల్లింపులపై ఇక నుంచి ఎలాంటి రివార్డ్‌ పాయింట్లు లభించవు.

* అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులతో ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ పొందాలంటే 3 నెలల్లో కనీసం రూ.50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..